Hyper Aadi : ముద్దు అడిగిన ఆది.. చెంప ఛెళ్లుమనిపించిన శ్రద్ధాదాస్‌.. ఢీ షో మొత్తం రచ్చ రచ్చ..!

October 7, 2022 7:25 AM

Hyper Aadi : బుల్లితెరపై బెస్ట్ కామెడీ షోల్లో ఒకటైన జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్ళు గడిచినా ఆ షో హవా తగ్గడం లేదు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారు. హైపర్‌ ఆది జబర్దస్త్ షోతో పాటు ఢీ షోలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. పంచ్‌ డైలాగ్‌లకు కేరాఫ్‌గా నిలిచే ఆది కొన్నిసార్లు ఇరుకున పడ్డ సందర్భాలున్నాయి. తాజాగా హైపర్‌ ఆది ఢీ షోలో నవ్వులు పూయిస్తున్నాడు. అయితే లేటెస్ట్ ఎపిసోడ్‌లో మాత్రం ఆయనకు గట్టి షాక్‌ తగిలింది. హీరోయిన్ ఢీ జడ్జ్ శ్రద్ధా దాస్‌ దిమ్మదిగిరే షాక్‌ ఇచ్చింది.

అందరి ముందు హైపర్‌ ఆది చెంప చెళ్లుమనిపించింది. అసలేం జరిగిందంటే.. ఢీ షోలో డాన్సర్ల అద్భుతమైన డాన్సుతో పాటు మధ్య మధ్యలో హైపర్‌ ఆది, యాంకర్‌ ప్రదీప్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అఖిల్‌ కామెడీ స్కిట్లతో నవ్వులు పూయిస్తుంటారు. అలాగే లేటెస్ట్ ఎపిసోడ్‌లో జరిగింది. డాన్సర్ల డాన్సు మధ్యలో హైపర్‌ ఆది, శ్రద్ధా దాస్‌, యాంకర్‌ ప్రదీప్‌ కామెడీ చేశారు. ఇందులో భాగంగా శ్రద్ధాదాస్‌ని ముద్దు అడిగాడు హైపర్‌ ఆది. అయితే అది శ్రద్ధా భాషలో అడిగే ప్రయత్నం చేశాడు.

Shraddha Das reaction after Hyper Aadi comments on her
Hyper Aadi

దీనికి యాంకర్‌ కాస్త పోప్‌ వేయగా, శ్రద్ధా ముద్దు కోసం వెయిట్‌ చేస్తున్న ఆదిని స్టేజ్‌పైనే చెంప పగలగొట్టి షాకిచ్చింది శ్రద్ధా దాస్‌. ఊహించని ఈ పరిణామంతో ఆది షాక్‌ అయ్యాడు. వెంటనే దాన్నుంచి తేరుకుని ధైర్యం చేసి ఆమెని మరోసారి ముద్దు అడిగాడు. మళ్లీ ఆయనకు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేసింది. ఆది చెస్ట్ పై గట్టిగా వరుసగా పంచ్‌లిచ్చింది. దీంతో తల్లడిల్లిపోయాడు ఆది. అయితే ఇదంతా కామెడీ కోసం సరదాగా చేసిన స్కిట్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఢీ లేటెస్ట్ ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now