Shiva Jyothi : శివ జ్యోతి ప్రెగ్నెంటా ? పూర్తి క్లారిటీ ఇదుగో..!

April 19, 2022 5:46 PM

Shiva Jyothi : న్యూస్‌ యాంకర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న శివ జ్యోతి బిగ్‌బాస్‌ 3 లో ఒక సామాన్యమైన సెలబ్రెటీగానే ఎంట్రీ ఇచ్చింది. ఈమె కంటే తోపులు చాలా మందే వెళ్లారు. కానీ మొదటి నుండి కూడా ఎవరితోనూ గొడవ పడకుండా, తనపనేంటో తాను చూసుకుంటూ చాలా కామ్‌గా ఈ అమ్మడు ఆడుతూ వచ్చింది. ఆ కారణంగా ఎక్కువగా నామినేషన్స్‌కు రాలేదు. అయితే ఈవిడ ఏడుపు స‌గం చిరాకు తెప్పించింది. చిన్నా చిత‌కా దానికి శివ జ్యోతి ఏడుస్తుండ‌డం ప్రేక్ష‌కుల‌కి అస‌హ‌నం క‌లిగించింది. ఇక షోలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ప‌లుమార్లు చెప్పుకొచ్చింది.

Shiva Jyothi given clarification over her pregnancy news
Shiva Jyothi

బిగ్ బాస్ షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా మారిన శివజ్యోతి ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియాలో మామిడి కాయ‌తో ఫొటో పెట్టింది. ఇక అంతే.. శివ జ్యోతి ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు పుట్టించారు. ఈ నేపథ్యంలో శివజ్యోతి స్పందించింది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా. ఇక అంతే.. అప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సృష్టిస్తున్నారు. వ్యూస్‌ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్‌ వేస్తున్నారు. మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తోంది. నేను కూడా వెయిట్‌ చేస్తున్నా.

నేను ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్‌ చేయనేమో అని అనుకుంటున్నారు. అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇందులో నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. అందుకే ఈ క్లారిటీ ఇస్తున్నాను. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. కాబట్టి నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్‌ ఉంటే నేనే మీ అందరితో షేర్‌ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకండి.. అంటూ చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now