శ్రీ‌ముఖి పెట్టిన ముద్దుల‌పై శేఖ‌ర్ మాస్ట‌ర్ స్పంద‌న‌.. కామెంట్స్ వైర‌ల్‌..

August 7, 2022 10:05 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పుల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎంద‌రో స్టార్ హీరోల‌కు ఆయ‌న ఫేవ‌రెట్ కొరియోగ్రాఫ‌ర్. స్టెప్పుల‌తో వెండితెర‌పై, పంచ్‌ల‌తో బుల్లితెర‌పై వినోదాన్ని పంచుతాడు. అందుకే టాలీవుడ్‌లో ఏ కొరియోగ్రాఫర్‌కు లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ శేఖర్‌ మాస్టర్‌ సొంతం.

ప్రస్తుతం ఈటీవీ నుంచి వెళ్ళిపోయి మా టీవీ కామెడీ స్టార్స్ కామెడీ షోలో నటుడు నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తన డాన్స్ కంపొజిషన్ తో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న శేఖర్ మాస్టర్ తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

shekhar master told about srimukhi incident

ఈ మధ్యనే స్నేహితుల బంధువే అవడంతో అప్పు తెచ్చి మరీ స్థలం కొనడానికి డబ్బు ఇచ్చాను. హైదరాబాద్, విజయవాడ హై వే లో స్థలం అని చెప్పారు. నమ్మి డబ్బు ఇస్తే లాక్ డౌన్ లో రేట్లు పడిపోయాయి అంటున్నారు. పోనీ ఎంతొస్తే అంత ఇవ్వండి అని అడిగినా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇక కొంతకాలంగా నా ఫోన్ కి కూడా వాళ్ళు స్పందించడం లేదు. అలా తెలిసిన వాళ్ళు నన్ను మోసం చేశారు అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

జబర్దస్త్, ఢీ లలో కనిపిస్తూ అప్పుడప్పుడూ పండుగ ఈవెంట్లలో సందడి చేస్తుండే శేఖర్ మాస్టర్ అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తారంటూ సరదాగా అనేవారు. ఇక రోజా, అనసూయ, రష్మీలతో డాన్స్ చేసినా కామెంట్స్ చేసేవాళ్ళు. అలా ఒకసారి పాటకు శ్రీముఖితో డాన్స్ చేస్తుంటే అనుకోకుండా తను ముద్దు పెట్టేసింది. అది బాగా వైరల్ అయింది. అసలు ఆ ముద్దులకు నాకు ఏం సంబంధం లేదు, ఆ పాటలో అలా అనుకోకుండా చేసేసింది అని వివరించారు. ఇక నాగబాబు ఆల్రెడీ కామెడీ షో కి జడ్జి గా కొన్నేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆయనతో కలిసి పనిచేయడం బాగుందన్నారు శేఖర్ మాస్టర్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now