Shekar Movie Review : రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ మూవీ రివ్యూ..!

May 20, 2022 10:44 AM

Shekar Movie Review : యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా గుర్తింపు పొందిన సీనియ‌ర్ హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయన ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించి న‌ట‌న‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును పొందారు. ఈ మ‌ధ్య కాలంలో ఈయ‌న చేస్తున్న చిత్రాల‌న్నీ ఎంతో వైవిధ్య‌భ‌రితంగా ఉంటున్నాయి. అవి అందువ‌ల్లే ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తున్నాయి. ఇక రాజ‌శేఖ‌ర్ చేసిన గ‌త రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. పీఎస్వీ గ‌రుడ వేగ బంప‌ర్ హిట్ కాగా.. క‌ల్కి ఫ‌ర్వాలేద‌నిపించింది. క‌థ‌, క‌థ‌నం కొత్త‌గా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రోమారు శేఖ‌ర్ అనే సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ మూవీ శుక్ర‌వారం (మే 20, 2022) థియేటర్లలో విడుద‌లైంది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. ప్రేక్ష‌కుల‌ను ఏ మేర అలరించింది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. వృద్ధాప్యంలో ఉంటాడు. స‌ర్వీస్ లో ఉన్న‌ప్పుడు ఈయ‌న ఎన్నో క్రైమ్ కేసుల‌ను ఇట్టే ఛేదిస్తాడు. అందుక‌ని ఆయ‌న రిటైర్ అయ్యాక కూడా పోలీసులు ఆయ‌న సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటుంటారు. ఈయ‌న నేరాల‌ను ప‌రిశోధించి నేర‌స్థుల‌ను పట్టించ‌డంలో దిట్ట‌. ఎంత దిట్ట అంటే.. ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇన్వెస్టిగేష‌న్ చేస్తూనే మ‌ర్డ‌ర్ జ‌రిగిన తెల్లారే ఆ ఇంటిని ప‌రిశీలించి మ‌రీ అక్క‌డే ఉన్న నేర‌స్థున్ని పోలీసుల‌కు ప‌ట్టిస్తాడు. ఈ ఒక్క సీన్ చాలు.. శేఖ‌ర్ ఎంత‌టి పేరుగాంచిన అధికారో చెప్పేందుకు. అయితే ఒక స‌మ‌యంలో త‌న మాజీ భార్య రోడ్డు యాక్సిడెంట్‌లో చ‌నిపోతుంది. కానీ కొన్ని కోణాల్లో ప‌రిశీలిస్తే అది హ‌త్య అని తెలుస్తుంది. అయితే ఆమెను హ‌త్య ఎవ‌రు చేశారు ? ఎందుకు చేశారు ? దాని వెనుక ఉన్న‌ది ఎవ‌రు ? దీనికి, చ‌నిపోయిన త‌న కుమార్తెకు మ‌ధ్య లింక్ ఏంటి ? అంత‌టి ఫేమ‌స్ పోలీస్ అధికారి త‌న సొంత కేసును ఎలా ప‌రిశోధించాడు ? చివ‌ర‌కు నేర‌స్థుల‌ను ప‌ట్టుకున్నాడా ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Shekar Movie Review Rajasekar
Shekar Movie Review

ఇక న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే.. రాజ‌శేఖ‌ర్ న‌ట‌న‌లో ఆరితేరారు. క‌నుక ఆయ‌న న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో ఆయ‌న ఎలా న‌టిస్తారో మ‌నంద‌రికీ తెలిసిందే. అందువ‌ల్ల ఈ సినిమాకు అన్నీ తానే అయి ముందుండి న‌డిపించారు. అలాగే మిగిలిన న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర ప‌రిధుల మేర బాగానే న‌టించారు.

ఇక ఈ మూవీ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ ఆధారంగా సాగుతుంది. దీంతో ప్ర‌తి సీన్ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని ప్రేక్ష‌కులు క‌ళ్లార్ప‌కుండా చూస్తుంటారు. క‌నుక ఇది ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక క‌థ‌నం కొత్త‌గా ఉంటుంది. గ‌తంలో క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ సినిమాలు అనేకం వ‌చ్చాయి. స‌రైన క‌థ‌తో అవ‌న్నీ ఎంతో హిట్ అయ్యాయి. అందుక‌నే రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాను చేశార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక సినిమా కాస్త నెమ్మ‌దిగా సాగుతుంది. ముఖ్యంగా కొన్ని సీన్లు అవ‌స‌రం లేద‌నిపిస్తాయి. అయితే ఓవరాల్‌గా చెప్పాలంటే.. క్రైమ్ నేప‌థ్యంలో మూవీ క‌థ సాగుతుంది క‌నుక ప్రేక్ష‌కులు సస్పెన్స్‌, థ్రిల్‌ను ఫీల‌వుతారు. క‌నుక ఆ త‌ర‌హా మూవీల‌ను చూసే వారికి శేఖ‌ర్ మూవీ కూడా న‌చ్చుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కొత్త‌ద‌నం కోరుకునేవారు ఒక‌సారి ఈ మూవీని చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now