Shani Graha : శ‌నిదోషం ఉన్న‌వారు.. శ‌ని బ‌ల‌హీనంగా ఉన్న‌వారు ఇలా చేస్తే చాలు.. శ‌ని ప్ర‌భావం మొత్తం పోతుంది.. క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతారు..

January 21, 2022 12:32 PM

Shani Graha : ప్ర‌తి మ‌నిషి జాత‌కం తొమ్మిది గ్ర‌హాల్లోని ఏవైనా గ్ర‌హాల సంచారం మీద ఆధారప‌డుతుంద‌నే విష‌యం అందరికీ తెలిసిందే. గ్ర‌హాల సంచారం అనుకూలంగా ఉంటే అన్నీ శుభ ఫ‌లితాలే క‌లుగుతాయి. లేదంటే అన్నీ క‌ష్టాలే వ‌స్తాయి. ఇక పుట్టిన‌ప్పుడు ఉండే గ్ర‌హ స్థితిని బ‌ట్టి గ్ర‌హ దోషాలు ఏర్ప‌డుతుంటాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి దోషాల‌కు శాంతి చేయిచాల్సి ఉంటుంది. దీంతో ఆ దోషం నుంచి బ‌య‌ట ప‌డి శుభ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Shani Graha defect persons do this to please him and remove problems

చాలా మందికి జీవితంలో శ‌ని దోషం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. శ‌నిదోషం ర‌క‌ర‌కాలుగా ఉంటుంది. అయితే శ‌ని చూపు స‌రిగ్గా లేక‌పోతే ఎవ‌రికైనా స‌రే ఇబ్బందులు త‌ప్ప‌వు. అందుక‌ని శ‌ని దేవున్ని ప్ర‌స‌న్నం చేసుకోవడానికి చాలా మంది ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. శ‌ని స‌రిగ్గా చూడ‌క‌పోతే అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయి.

శ‌ని దుష్ప్ర‌భావం వ‌ల్ల తీవ్రమైన స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతుంటాయి. చేసే ప్ర‌తి ప‌నిలోనూ ఆటంకం క‌లుగుతుంది. ఏ ప‌నీ పూర్తికాదు. అలాగే ఒత్తిడి, ఆందోళ‌న, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. చేతిలో చిల్లి గ‌వ్వ ఉండ‌దు. ఇవ‌న్నీ శ‌ని సృష్టించే ఆటంకాలే అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి వారు కింద చెప్పిన విధంగా చేస్తే శ‌ని ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. దీంతో శ‌ని చూపు స‌రిగ్గా ఉంటుంది. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అన్నీ శుభాలే క‌లుగుతాయి. మ‌రి శ‌నిని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే.. ఏం చేయాల్సి ఉంటుందంటే..

మీ కుండలిలో శని దోషం లేదా శని బలహీనంగా ఉంటే ప్రతి శనివారం కొబ్బరికాయను గంగా, యమునా నది నీటిలో వ‌ద‌లాలి. లేదా స‌మీపంలో ఉన్న ఏదైనా న‌దిలోనూ కొబ్బ‌రికాయ‌ను వ‌ద‌ల‌వ‌చ్చు. అలా కొబ్బ‌రికాయ‌ను వ‌దిలే స‌మ‌యంలో ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని ప‌ఠించాలి. ఇలా వ‌రుస‌గా 7 శ‌నివారాలు చేయాలి. దీంతో అన్ని సమస్యలు తొలగిపోతాయి. శనితో ఇబ్బందులు ఉండ‌వు. పైగా శ‌ని అనుగ్ర‌హం ల‌భిస్తుంది. హనుమంతుడి ఆశీర్వాదం కూడా వెన్నంటే ఉంటుంది. ఎలాంటి స‌మ‌స్య‌లు, క‌ష్టాలు ఉండ‌వు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now