Sreemukhi : వామ్మో.. శ్రీముఖిని ఎత్తలేక కింద పడిపోయిన షకలక శంకర్..!

October 9, 2021 7:28 PM

Sreemukhi : బుల్లితెర రాములమ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడమే కాకుండా వెండితెరపై కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేయడంతో ఎంతో మంచి పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. ఇకపోతే బుల్లితెరపై ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అక్కడ శ్రీముఖి సందడి చేస్తుంటుంది.

shakalaka shankar did not lift Sreemukhi

ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా జీ తెలుగులో ప్రసారం కానున్న దసరా దోస్తీ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లిసందD చిత్రబృందం వచ్చింది. ఈ సినిమాలో కమెడియన్ షకలక శంకర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే షకలక శంకర్ కూడా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఓ సన్నివేశంలో షకలక శంకర్ శ్రీముఖిని ఎత్తుకోవాలని ప్రయత్నం చేశాడు. అయితే శ్రీముఖి ఎంతో బొద్దుగా ఉండడంతో శ్రీముఖిని ఎత్తలేక షకలక శంకర్ కిందపడిపోవడంతో వేదికపై ఉన్న అందరూ నవ్వారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now