Shahrukh Khan : తండ్రి షారూఖ్‌కు అప్ర‌తిష్ట తెచ్చిన ఆర్య‌న్ ఖాన్‌.. ఆర్థికంగానూ న‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న బాద్‌షా..

October 10, 2021 8:05 AM

Shahrukh Khan : ఆర్య‌న్ ఖాన్ చేసిన త‌ప్పు త‌న తండ్రి షారూఖ్ ఖాన్‌కు గుదిబండ‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న పేరు ప్ర‌ఖ్యాతుల‌కు భంగం క‌లిగింది. కానీ ఇప్పుడు షారూఖ్‌కు ఆర్థికంగానూ న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఆయ‌న ప్ర‌చార క‌ర్త‌గా ఉన్న బైజూస్‌తోపాటు ప‌లు ఇత‌ర కంపెనీలు షారూఖ్ ఉన్న యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో షారూఖ్‌కు పెద్ద ఎత్తున న‌ష్ట‌మే క‌లుగుతుంద‌ని అంటున్నారు.

Shahrukh Khan getting economical loss also because of aryan khan

తండ్రేమో పిల్ల‌ల‌కు స‌రిగ్గా చ‌దువుకోవాల‌ని బైజూస్ పాఠాలు చెబుతున్నాడు, కానీ కొడుకు డ్ర‌గ్స్‌, అమ్మాయిలు అంటూ వెంట‌బ‌డుతున్నాడు. అలాంటి తండ్రి చెప్పేది మేం వినాలా ? కొడుకునే స‌రిగ్గా పెంచ‌లేదు, ఇక ఇత‌ర పిల్ల‌ల‌కు చ‌దువుకోవాల‌ని ఆయ‌న ఎలా పాఠాలు చెబుతారు ? అంటూ.. నెటిజ‌న్లు షారూఖ్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో బైజూస్ తాత్కాలికంగా షారూఖ్ న‌టించిన యాడ్స్ ను ప్ర‌సారం చేయ‌కుండా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అయితే బైజూస్ బాట‌లోనే ఇత‌ర కంపెనీలు కూడా న‌డ‌వ‌నున్నాయా ? అంటే.. అందుకు అవున‌నే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇది తాత్కాలిక‌మే అయితే ఫ‌ర్వాలేదు, కానీ ఇది ఇలాగే కొన‌సాగితే.. కొడుకు వ‌ల్ల షారూఖ్‌కు అటు ఆర్థికంగా కూడా తీవ్ర న‌ష్ట‌మే క‌లుగుతుంద‌ని సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now