Shahid Kapoor : హీరో పెద‌వికి బ‌లంగా త‌గిలిన బంతి.. 25 కుట్లు ప‌డ్డాయ‌ట‌..!

November 29, 2021 3:17 PM

Shahid Kapoor : సినిమా కోసం మ‌న హీరోలు చాలా రిస్క్‌లే చేస్తుంటారు. కొన్ని సార్లు ప్ర‌మాదానికి ఎదురెళుతుంటారు. తాజాగా ఓ హీరో సినిమా కోసం త‌న పెద‌విని గాయ‌ప‌ర‌చుకున్నాడు. దీని వ‌ల‌న పాతిక కుట్లు ప‌డ్డాయ‌ట‌. వివ‌రాల‌లోకి వెళితే.. షాహిద్ కపూర్ కథానాయకుడిగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `జెర్సీ`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌ పై హిందీలో నిర్మిస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు.

Shahid Kapoor : హీరో పెద‌వికి బ‌లంగా త‌గిలిన బంతి.. 25 కుట్లు ప‌డ్డాయ‌ట‌..!

హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్‌ సాధన చేస్తూ తాను తీవ్రంగా గాయపడినట్లు షాహిద్‌కపూర్‌ పేర్కొన్నారు. కింది పెదవికి బాల్‌ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని ఆయన చెప్పారు. చిత్రంలో జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని తపించే క్రికెటర్‌గా షాహిద్‌కపూర్‌ నటిస్తున్నారు. ‘క్రికెటర్‌ పాత్ర కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఓ రోజు బాల్‌ బలంగా తాకడంతో నా కింది పెదవి చిట్లింది.

25 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డా. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌ను ఆపివేశాం’ అని గుర్తుచేసుకున్నాడు. ఇది క్రికెట్ నేపథ్యంలో సినిమా కావడంతో చాలా సాహసాలే చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని షాహిద్ కపూర్ తాజాగా వెల్లడించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment