దివంగత నటుడు ఉదయ్ కిరణ్ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా.. చిత్రం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్ కొట్టాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరో హోదాను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్‌లు, ఫ్లాప్‌లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది.
ఉదయ్ కిరణ్ వంటి యంగ్ స్టార్ అకాల మరణం చెందడం చాలా మందిని బాధపెట్టింది. ఉదయ్ కిరణ్‌తో అనుబంధం ఉన్నవారి మానసిక సంఘర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో సీనియర్ నటిగా పేరున్న సుధ.. రీసెంట్ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటి సుధ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్‌కి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి దూరమయ్యాడు. మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయ్యింది. ఒంటరితనంలో ఉండిపోయాడు. నేను కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉదయ కిరణ్‌ని చూసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ ఏమో అనిపించింది.
ఒకవేళ తను ఈ రోజు ఉండుంటే ఉదయ్ కిరణ్ హీరోనా, సినిమాలు చేస్తాడా.. చేయడా! అనే విషయాలను పక్కన పెట్టేస్తే నా ప్రాపర్టీ అంతా తనకు దక్కేది. వాడు హ్యాపీగా ఉండేవాడు. నేను ఉదయ్ కిరణ్‌ను దత్తత తీసుకోవాలనుకున్నాను. కోర్టులో దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ సబ్ మిట్ చేశాం. కోర్టు నుంచి ఆర్డర్ వస్తే దత్తత తీసుకోవచ్చు. ఈలోపు తను ఫోన్ కట్ చేశాడు. మాటలు తగ్గిపోయాయి. నా కూతురు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. మా అందరినీ దూరం పెడుతూ వచ్చాడు.
ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకోబోయే సంగతి కూడా నాకు చెప్పలేదు. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఇన్విటేషన్ పంపాడు. బాధతో వెళ్లాలని అనుకోలేదు. ఆ అమ్మాయి ఉదయ్‌కి సెట్ కాకపోవచ్చునని నా మనసుకి అనిపించింది. మనం వెళ్లకపోతే వాడు గిల్టీగా ఫీల్ అవుతాడేమో అనుకున్నాను. వాడు ఉండుంటే ఇప్పుడు నాకు కాస్త బలంగా ఉండేది.
ఉదయ్ కిరణ్ ఓ రోజు నన్ను కలవడానికి ఏడుపు దిగమింగుకుని వచ్చాడు. నా హెయిర్ డ్రెస్సర్ దగ్గరకు వచ్చి అమ్మతో మాట్లాడాలంటూ అడిగాడు. తను వచ్చి నా దగ్గర ఉదయ్ వచ్చిన విషయం చెప్పాడు. వాడు నా దగ్గర రావటానికి అడగాలా ఏంట్రా ! రమ్మను వాడిని.. అన్నాను. నేను ఛెయిర్ లో కూర్చుని ఉన్నాను. పక్కనే చలపతి రావుగారున్నారు. రావటం.. రావటం నా కాళ్లు పట్టుకుని గట్టిగా ఏడ్చాడు. ఆ ఏడుపుని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను. తనతో ఏదో జన్మలో అనుబంధం ఉండి ఉంటుందేమో.. అది ఇలా తీర్చేసి తను వెళ్లిపోయాడు.. అని ఎమోషనల్‌గా చెప్పారామె.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…