Senior Actress : టెలిఫోన్ ప‌ట్టుకుని ముద్దుగా క‌నిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌.. ఎవ‌రో తెలిసిందా..?

September 16, 2022 10:28 PM

Senior Actress : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఇప్పటి తారలు ఫొటోస్ మాత్రమే కాదు, 1990వ‌ దశాబ్దంలో అగ్రస్థాయి స్టార్ లుగా గుర్తింపు పొందిన ఎంతో మంది నటుల‌ చిన్ననాటి  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారల చిన్ననాటి ఫొటోస్ చూడడానికి అభిమానులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫొటోలో కనిపించే చక్రాలుల‌ లాంటి కళ్ళతో ముద్దులొలికే అమాయకమైన ముఖంతో ఉన్న చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది.

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా అగ్రస్థాయి హీరోలతో ఆడి పాడింది. నవయుగం చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ సరసన హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఎవరు ఆ హీరోయిన్ అని ఆలోచిస్తున్నారా.. స్టార్ హీరో వెంకటేష్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన కూడా జతకట్టింది. అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా అంటూ మెగాస్టార్ తో ముఠామేస్త్రి చిత్రంలో అందరినీ తన వైపు ఆకర్షించింది. అప్పట్లో  రమ్యకృష్ణ, రోజా, రంభ వంటి హీరోయిన్స్ కి గట్టి పోటీగా నిలిచింది. ఈ స్టార్ హీరోయిన్ ఇంకెవరో కాదు, అందాల ముద్దుగుమ్మ  మీనా.

Senior Actress meena childhood photos viral
Senior Actress

1982లో తమిళ చిత్రం నెంజంగళ్‌ తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరపైకి రంగప్రవేశం చేసింది. మీనాకు ఈ అవకాశం శివాజీ గణేశన్  ద్వారా వచ్చింది. ఆమెను పుట్టినరోజు పార్టీలో చూసిన తర్వాత శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలో నటించిన నెంజంగళ్‌ చిత్రంలో క‌నిపించింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా శివాజీ గణేషన్‌తోపాటు పలు చిత్రాలలో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మీనా దాదాపు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్రాలతో కలిపి 20 వరకు నటించింది. ఆ తర్వాత 13 ఏళ్ల వయసుకే నవయుగం చిత్రం ద్వారా సుమతి పాత్రలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  స్టార్ హీరోల సరసన చంటి, అల్లరి మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ముఠామేస్త్రి వంటి ఎన్నో చిత్రాలలో నటించి నటన పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now