Seetha Ramam : ఓటీటీలో వ‌స్తున్న సీతారామం మూవీ.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..

September 6, 2022 4:05 PM

Seetha Ramam : ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ్యాడు మలయాళం సూపర్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఆ త‌ర్వాత మ‌హాన‌టితో నేరుగా తెలుగులోనే న‌టించి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. తాజాగా దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగులో హీరోగా నటించిన చిత్రం సీతారామం. బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఫీల్‌గుడ్‌ మూవీస్ ని తెరకెక్కించే హను రాఘవపూడి మరో క్లాసిక్‌ లవ్‌స్టోరీని సీతారామం రూపంలో మనకు అందించాడు. స్వప్న సినిమా బ్యానర్ లో వైజయంతీ మూవీస్‌పై అశ్వినీ దత్ సీతారామం చిత్రాన్ని నిర్మించారు.

బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. దీంతో చిత్రబృందమంతా హ్యాపీమూడ్‌లో ఉంది. సినిమా విడుద‌లై నెల రోజులు అవుతుంది. ఇప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. అలాగే సినిమాను రీసెంట్‌గా హిందీలోనూ అనువ‌దించి రిలీజ్ చేశారు. అక్క‌డా మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే సీతారామం చిత్రానికి సంబంధించిన ఓ మేజ‌ర్ అప్‌డేట్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే ఓటీటీ రిలీజ్. సీతారామం సినిమా ఇప్ప‌టికే 80 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను దాటేసి వంద కోట్ల రేస్ లో ఉంది.

Seetha Ramam movie releasing on OTT
Seetha Ramam

ఓవ‌ర్ సీస్‌లో సినిమా వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూళ్ల‌ను క్రాస్ చేయ‌టం విశేషం. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా.. అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. సెప్టెంబ‌ర్ 9న సీతారామం మూవీ ప్ర‌ముఖ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌టంతోపాటు రీసెంట్‌గానే హిందీలోనూ సినిమాను విడుద‌ల చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఈ శుక్రవారం కోసం ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now