Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మూవీ రివ్యూ..!

May 12, 2022 8:25 AM

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా ఈపాటికి ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ మూవీ గురువారం థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ‌త 2 ఏళ్ల నుంచి మ‌హేష్ సినిమాలు లేవు. దీంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఎట్ట‌కేల‌కు వారి దాహం తీరింది. స‌ర్కారు వారి పాట విడుద‌ల కావ‌డంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా.. లేదా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

స‌ర్కారు వారి పాట మూవీలో మ‌హి (మ‌హేష్ బాబు) వ‌డ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అత‌ను డ‌బ్బుకు చాలా విలువ‌నిస్తాడు. డ‌బ్బును గౌరవిస్తాడు. ఎవ‌రికైనా అత‌ను అత‌ను అప్పు ఇస్తే వారు తిరిగి చెల్లించ‌క‌పోతే దాన్ని రాబ‌ట్టుకునేందుకు మ‌హి ఎక్క‌డి వ‌ర‌కైనా వెళ్తాడు. ఈ క్ర‌మంలోనే ఓ స‌మ‌యంలో విదేశాలకు వెళ్లి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌నే లక్ష్యంతో ఉన్న కళావతి (కీర్తి సురేష్)ని కలుసుకుంటాడు. కాగా ఆమెకు కొంత డబ్బు అవ‌స‌రం అవుతుంది. దీంతో ఆమె తన చ‌దువుల‌ కోసం అప్పు ఇవ్వమని మహిని రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఇక ఆమెకు అప్పు ఇచ్చే క్ర‌మంలో మహి ఆమెతో ప్రేమలో పడ‌తాడు. ఇక మహికి అనుకోని పరిస్థితుల్లో రాజేంద్రనాథ్ (సముద్ర‌ఖ‌ని)తో గొడ‌వ అవుతుంది. చివరికి ఈ గొడవ పెద్ద‌ద‌వుతుంది. అది పెద్ద స్కామ్‌కి దారి తీస్తుంది. దీంతో మ‌హి వైజాగ్‌కు వ‌స్తాడు. అక్క‌డ అస‌లు క‌థ ప్రారంభం అవుతుంది. ఈ క్ర‌మంలోనే మ‌హికి, రాజేంద్ర‌నాథ్‌కు మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఏమిటి ? త‌న డ‌బ్బుల‌ను అత‌ను ఎలా రాబ‌ట్టుకున్నాడు ? స్కామ్ కు పాల్ప‌డిన వాళ్ల‌ను ఎలా బ‌య‌టకు లాక్కొస్తాడు ? చివ‌ర‌కు అస‌లు ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Sarkaru Vaari Paata movie review
Sarkaru Vaari Paata

ఈ మూవీలో మ‌హేష్ బాబు భిన్న‌మైన గెట‌ప్‌లో క‌నిపించారు. ఆయ‌న ఎన్నో ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించారు. ఇది కూడా అలాంటి ఒక చిత్ర‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న గ‌త కొన్నేళ్లుగా చేస్తున్న చిత్రాలు అన్నీ సమాజానికి మెసేజ్ ఇచ్చిన‌వే అయి ఉంటున్నాయి. ఈ మూవీ కూడా అలాంటిదే అని చెప్ప‌వ‌చ్చు. ఇక స‌ర్కారు వారి పాట‌కు మ‌హేష్ అన్నీ తానే అయి క‌థ‌ను ముందుకు న‌డిపించార‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న గ‌తంలో చేసిన చిత్రాల‌కు దీనికి చాలా వ్య‌త్యాసం ఉంటుంది. ఇక కీర్తి సురేష్ విష‌యానికి వ‌స్తే ఆమె అద్భుతంగా న‌టించింది. మ‌హేష్‌, ఆమెకు మ‌ధ్య వ‌చ్చే సీన్లు ప్రేక్ష‌కుల‌చే విజిల్స్ కొట్టిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక వెన్నెల కిషోర్‌, స‌ముద్రఖ‌ని, మిగిలిన న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర బాగానే న‌టించారు.

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ సినిమాను అద్భుతంగా ప్రేక్ష‌కుల ముందు ఉంచారు. అలాగే సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, పాటలు ఆక‌ట్టుకుంటాయి. కానీ క‌థ సాగే విధానం ఒక్క‌టే నెమ్మ‌దిగా ఉంటుంది. దీన్ని త‌ప్పిస్తే ఓవ‌రాల్‌గా స‌ర్కారు వారి పాట మంచి కామెడీ యాక్ష‌న్ డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ చిత్రంతో మ‌హేష్ మ‌ళ్లీ ఇంకో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నార‌ని నిర్మొహ‌మాటంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు పోటీ కూడా ఏ సినిమాలు లేవు క‌నుక‌.. స‌ర్కారు వారి పాట బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్రేక్ష‌కులు ఈ మూవీని ఈ స‌మ్మ‌ర్‌లో త‌ప్ప‌క ఎంజాయ్ చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now