Sarkaru Vaari Paata : మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. స‌ర్కారు వారి పాట తొలి సాంగ్ విడుద‌ల తేదీ ఖ‌రారు..!

January 26, 2022 1:15 PM

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేశారు. అయితే త్వ‌ర‌లో మూవీని విడుద‌ల చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. అందులో భాగంగానే త్వ‌ర‌లో మూవీ నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Sarkaru Vaari Paata first song will be launching on that day

స‌ర్కారు వారి పాట మూవీలో నుంచి తొలి సాంగ్‌ను ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. కాగా ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

స‌ర్కారు వారి పాటలో మొత్తం 5 పాట‌లు ఉండ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌బోయే తొలి పాట రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. చాలా గ్యాప్ త‌రువాత థ‌మ‌న్.. మ‌హేష్ బాబు సినిమాకు సంగీతాన్ని అందిస్తుండ‌డం విశేషం.

ఇక స‌ర్కారు వారి పాట మూవీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 1వ తేదీన విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో కొత్త విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇక ఈ మూవీలో కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్‌లో న‌టిస్తోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ వారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now