Sarayu : ఏడేళ్లు ఇద్ద‌రం స‌హ‌జీవ‌నం చేశాం.. పెళ్లిని నేనే క్యాన్సిల్ చేశా: స‌ర‌యూ

September 27, 2021 11:19 PM

Sarayu : బిగ్ బాస్ తెలుగు 5వ సీజ‌న్‌లో మొద‌టి వారంలోనే స‌ర‌యూ బ‌య‌టికి వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. యూట్యూబ్ వీడియోల‌తో బాగా ఫేమ‌స్ అయిన‌ప్ప‌టికీ అదే దూకుడు ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో నిల‌ప‌లేక‌పోయింది. దీంతో ఆమె త్వ‌ర‌గా ఎలిమినేట్ అయింది. అయిన‌ప్ప‌టికీ ఆమె చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. హౌస్‌లో ఉన్న‌ది కొంత కాల‌మే అయినా.. త‌న టెంపోను అలాగే కొన‌సాగించింది.

Sarayu : ఏడేళ్లు ఇద్ద‌రం స‌హ‌జీవ‌నం చేశాం.. పెళ్లిని నేనే క్యాన్సిల్ చేశా: స‌ర‌యూ
Sarayu

స‌ర‌యూ గురించి పెద్ద‌గా ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంది. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్‌లో ఆమె చేసే అడ‌ల్ట్ కామెడీకి భీభ‌త్స‌మైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కొంద‌రు విమ‌ర్శించే వారు కూడా ఉన్నారు. అది వేరే విష‌యం. కానీ స‌ర‌యూ వాటి గురించి ప‌ట్టించుకోకుండా ముందుకే సాగి యూట్యూబ్ స్టార్‌గా ఫేమ‌స్ అయింది.

Sarayu : ఏడేళ్లు ఇద్ద‌రం స‌హ‌జీవ‌నం చేశాం.. పెళ్లిని నేనే క్యాన్సిల్ చేశా: స‌ర‌యూ
Sarayu

ఇక తాజాగా స‌ర‌యూ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది. త‌న ల‌వ్ స్టోరీకి చెందిన విశేషాల‌ను ఆమె చెప్పింది. తాను ఒక వ్య‌క్తితో 7 ఏళ్ల‌పాటు స‌హ‌జీవ‌నం చేశాన‌ని, ఆ విష‌యం ఇంట్లో అంద‌రికీ తెలుస‌ని చెప్పింది.

Sarayu : ఏడేళ్లు ఇద్ద‌రం స‌హ‌జీవ‌నం చేశాం.. పెళ్లిని నేనే క్యాన్సిల్ చేశా: స‌ర‌యూ
Sarayu

తాను ఆ వ్య‌క్తితో రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌గా త‌న కెరీర్‌ను కూడా ప‌క్క‌న పెట్టాన‌ని, కానీ త‌మ వివాహం ఆగిపోయింద‌ని తెలిపింది. తాను రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌గా అత‌నికి 100 ప‌ర్సెంట్ ఇచ్చేశాన‌ని, తాను వ‌ర్జిన్ కూడా కాద‌ని చెప్పింది. అయితే క‌ట్నం వ‌ల్ల త‌మ పెళ్లి ఆగిపోయింద‌ని తెలిపింది.

ఆ వ్య‌క్తి మొద‌ట క‌ట్నంగా రూ.25 ల‌క్ష‌లు అడిగాడ‌ని, త‌రువాత దాన్ని రూ.50 ల‌క్ష‌లు చేశాడ‌ని, మ‌ళ్లీ రూ.1 కోటి క‌ట్నం కావాల‌ని అడిగాడ‌ని, క‌నుక పెళ్లి ర‌ద్దు అయింద‌ని చెప్పింది. ఇప్పుడే అలా త్వ‌ర‌గా మాట మారిస్తే భ‌విష్య‌త్తులో ఏం చేస్తాడోన‌ని తానే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాన‌ని చెప్పింది. ఆ విష‌యాన్ని ఆ వ్య‌క్తి ముఖం మీదే చెప్పాన‌ని.. స‌ర‌యూ తెలిపింది. కాగా ఆమె పంచుకున్న ఈ విశేషాలు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now