Sara Ali Khan : సారా అలీఖాన్‌ను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు.. కారణం..?

November 6, 2021 3:05 PM

Sara Ali Khan : బాలీవుడ్ నటీమణులు సారా అలీఖాన్, జాన్వీ కపూర్ లు కలసి రీసెంట్ గా ఉత్తరాఖండ్ కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలకు వెళ్ళారు. ఈ క్రమంలో వారు దిగిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. జాన్వీ, సారా ఖాన్ ల ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం సారాను ట్రోల్ చేస్తున్నారు. సారా, జాన్వీల ఫోటోలు ఎంతో అందంగా ఉన్నాయని అంటున్నారు.

Sara Ali Khan trolled by netizen over her kedarnath visit with janhvi kapoor

ప్రముఖ పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ దేవాలయాన్ని సారా అలీఖాన్ సందర్శించినందుకు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సారా అలీఖాన్ కేదార్ నాథ్ ను దర్శించుకోవడం చాలామందికి నచ్చలేదనే విషయం ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కామెంట్ బాక్స్ ని చూస్తే తెలుస్తోంది. దారుణమైన కామెంట్స్ చేశారు. సారా అలీఖాన్ ను మతం గురించి టార్గెట్ చేశారు.

మరికొంతమంది అయితే సారా అలీఖాన్.. నీ పేరు మార్చుకో..  అంటూ కామెంట్ చేశారు. సారా అలీఖాన్.. మీరు గుడిలో ఏం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక గతంలో కూడా సారా అలీఖాన్ పై ఇదే విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now