Sankranthi 2022 : ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఎప్పుడు వ‌చ్చింది ? శుభ ముహుర్తం ఎప్పుడో తెలుసా ?

January 7, 2022 12:55 PM

Sankranthi 2022 : కేవ‌లం భార‌త‌దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు అంద‌రూ జ‌న‌వ‌రి నెల‌లో మ‌క‌ర సంక్రాంతి పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. మొత్తం మూడు రోజుల పాటు జ‌రిగే ఈ పండుగ‌లో భాగంగా తొలి రోజును భోగి పండుగ రూపంలో, రెండో రోజు సంక్రాంతిగా, మూడో రోజు క‌నుమ‌గా జ‌రుపుకుంటారు. ఈ క్ర‌మంలోనే మూడు రోజులు భిన్న‌మైన పూజా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌ర్తిస్తుంటారు.

Sankranthi 2022 on which day it has came and shubha muhurtham

ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ జ‌న‌వ‌రి 15వ తేదీన వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే 14వ తేదీన భోగి పండుగ‌ను, 16వ తేదీన క‌నుమ పండుగ‌ను జ‌రుపుకోనున్నారు. ఇక సంక్రాంతి రోజు.. అంటే 15వ తేదీ రోజు మ‌ధ్యాహ్నం 2.43 గంట‌ల నుంచి సాయంత్రం 5.45 గంట‌ల వ‌ర‌కు శుభ ముహుర్తం ఉంది. ఇది అన్ని పూజ‌ల‌కు అనుకూలం. క‌నుక ఎవ‌రైనా పూజ‌లు చేయ‌ద‌లిచినా.. ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాల్సిన వ‌చ్చినా.. వాహ‌నాల‌కు పూజ అయినా.. ఏ పూజ అయినా స‌రే.. ఈ స‌మ‌యంలో చేస్తే అంతా మంచే జ‌రుగుతుంది.

సంక్రాంతి పండుగ నుంచి ఉత్త‌రాయ‌ణం మొద‌ల‌వుతుంది. ఈ రోజు నుంచి సూర్యుడు ద‌క్షిణాయం వ‌దిలి పెట్టి ఉత్త‌రాయ‌ణంలోకి ప్ర‌వేశిస్తాడు. ఈ స‌మ‌యంలో రైతుల పంట చేతికొస్తుంది. అన్ని కుటుంబాల్లోనూ సుఖ సంతోషాలు వెల్ల‌విరిస్తాయి. అందుక‌నే సంక్రాంతి పండుగ‌ను రైతులు పెద్ద ఎత్తున జ‌రుపుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment