Sankranthi 2022 : సంక్రాంతి పండుగ రోజు ఇలా చేయండి.. స‌క‌ల సంప‌ద‌ల‌ను పొందుతారు..!

January 14, 2022 7:54 PM

Sankranthi 2022 : సంక్రాంతి పండుగ‌కు ప్ర‌తి ఇంట్లోనూ సంద‌డి నెల‌కొంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా స‌రే ఈ పండుగ‌ను వైభ‌వంగా జ‌రుపుకుంటారు. సూర్యుడు మ‌క‌ర రాశిలో ప్ర‌వేశించ‌డంతోపాటు ఉత్త‌రాయ‌ణంలోకి వ‌స్తాడు. అందుక‌నే ఈ రోజును మ‌క‌ర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ క్ర‌మంలోనే సంక్రాతి పండుగ రోజు ఎక్క‌డ చూసినా తెలుగు వారి వాకిళ్లన్నీ రంగు రంగుల రంగ‌వ‌ల్లిక‌లు, గొబ్బెమ్మ‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.

Sankranthi 2022 do like this on festival for wealth and prosperity

ఇక సంక్రాంతి పండుగ‌కు ఎంతో హ‌డావిడి ఉంటుంది. రైతుల‌కు పంట చేతికి వ‌స్తుంది. ప్ర‌తి ఇంట్లోనూ ఆనందాలు నెల‌కొంటాయి. పిండి వంట‌లను ఆర‌గిస్తూ, ప‌తంగుల‌ను ఎగుర వేస్తూ ఉత్సాహంగా పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ జ‌న‌వ‌రి 15వ తేదీన వ‌చ్చింది.

జ‌న‌వ‌రి 15న మ‌ధ్యాహ్నం 2.43 గంట‌ల నుంచి సాయంత్రం 5.45 గంట‌ల వ‌ర‌కు దివ్య‌మైన ముహుర్తం ఉంది. అందువ‌ల్ల ఈ స‌మ‌యం పూజ‌ల‌కు, కొత్త ప‌నులు, వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైంద‌ని చెబుతున్నారు. ఇక సంక్రాంతి రోజు ప‌లు కార్య‌క్ర‌మాలు చేయ‌డం వ‌ల్ల స‌క‌ల సంప‌ద‌లు క‌ల‌గ‌డంతోపాటు అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోయి కుటుంబంలో సంతోషాలు నెల‌కొంటాయ‌ని, ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక సంక్రాంతి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను ధ‌రించాలి. దీంతో శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసి గ‌డ‌ప‌కు ప‌సుపు, కుంకుమ రాయాలి. గుమ్మానికి మామిడి ఆకుల తోర‌ణాల‌ను అలంక‌రించాలి. పూల తోర‌ణాల‌ను క‌ట్టాలి. దీని వ‌ల్ల ఇంట్లో ఉండు చెడు ప్ర‌భావం తొల‌గిపోతుంది. మంచి ప్ర‌భావం ఏర్ప‌డుతుంది.

సంక్రాంతి రోజు ఇంట్లోని పూజ గ‌ది లేదా మందిరాన్ని అలంక‌రించుకోవాలి. పితృ దేవ‌త‌ల‌కు పూజ‌లు చేయాలి. దీంతో వారి ఆశీస్సులు ల‌భిస్తాయి. చేసే ప‌నిలో తిరుగుండ‌దు. లాభాల‌ను ఆర్జిస్తారు. సంక్రాంతి రోజు మ‌హిళ‌లు పువ్వులు, పసుపు, కుంకుమ, బెల్లం, పండ్లను దానం చేయ‌డం వ‌ల్ల సకల సంపదలు ల‌భిస్తాయి. అలాగే మ‌హిళ‌ల‌కు దీర్ఘసుమంగళి ప్రాప్తం కలుగుతుంది.

సంక్రాతి నాడు గుమ్మ‌డి పండ్ల‌ను దానం చేయాలి. దీని వ‌ల్ల శ్రీ‌మ‌హావిష్ణువుకు బ్ర‌హ్మాండాన్ని దానమిచ్చిన పుణ్య ఫ‌లం ల‌భిస్తుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. సిరిసంప‌ద‌లు వ‌స్తాయి. అలాగే చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాలి. వాటినే పితృదేవతలకు కూడా పెట్ట‌వ‌చ్చు. దీంతో మోక్షమార్గం ల‌భిస్తుంది. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

పండుగ నాడు ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టాలి. దీంతో వారి కాపురం క‌ల‌హాలు లేకుండా సాగుతుంది. అలాగే యాచ‌కుల‌కు అన్న‌దానం చేయాలి. దీంతో పుణ్యం ల‌భిస్తుంది. ఎవ‌రితోనూ గొడ‌వ‌లు, కొట్లాట‌లు పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి. దీని వ‌ల్ల స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment