Sania Mirza : రిటైర్మెంట్‌ నిర్ణయం అందుకే.. అసలు కారణాలను వెల్లడించిన సానియా మీర్జా..

January 29, 2022 9:54 PM

Sania Mirza : టెన్నిస్‌లో అంతర్జాతీయ స్టార్‌గా సానియా మీర్జా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. పలు టైటిల్స్‌ను కూడా సాధించింది. అయితే ఇటీవల ఆమె తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది తనకు చివరిదని తెలియజేసింది. అయితే రిటైర్మెంట్‌ ఎందుకు తీసుకుంటుందో తాజాగా ఆమె వివరించింది. ఈ మేరకు ఆమె ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించింది.

Sania Mirza told why she is retiring from tennis

తనకు ప్రస్తుతం 35 సంవత్సరాలని.. అంతేకాకుండా తనకు మూడు పెద్ద సర్జరీలు జరిగాయని సానియా మీర్జా తెలిపింది. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ కోసం చాలా శ్రమించాల్సి వస్తుందని పేర్కొంది. రెండు సార్లు తన మోకాలికి, ఒకసారి మణికట్టుకు సర్జరీలు జరిగాయని తెలియజేసింది. ఈ క్రమంలోనే తన శరీరం ప్రస్తుతం సహకరించడం లేదని తెలిపింది.

అలాగే తనకు 3 ఏళ్ల కొడుకు ఉన్నాడని, అతన్ని చూసుకోవడంతోపాటు శరీరం తిరిగి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. అందుకనే రిటైర్మెంట్‌ ప్రకటించానని చెప్పుకొచ్చింది. అయితే తన రిటైర్మెంట్‌ నిర్ణయం ఎంతో మందిని బాధించిందని, చాలా మంది తనకు మెసేజ్‌ చేశారని.. ఈ ఏడాది చివరి వరకు ఆడేందుకు ప్రయత్నిస్తానని ఆమె తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now