Sandeep Reddy Vanga : ప్రభాస్ సినిమాలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు 50 శాతం షేర్!

October 31, 2021 9:29 AM

Sandeep Reddy Vanga : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంటేనే ప్రతిభకు పట్టం గడుతుంది. అలా ఒక్క సినిమా ఛాన్స్ తో లైఫ్ టర్న్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అటు హీరోగా విజయ్ దేవరకొండకు, ఇటు డైరెక్టర్ గా సందీప్ రెడ్డికి కూడా కెరీర్ టర్న్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు.

Sandeep Reddy Vanga will get 50 percent share in prabhas movie

షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగానే డైరెక్షన్ చేశారు. అలా కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ గా మారారు. నెక్ట్స్ రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమాను తెరకెక్కించారు. యంగ్ రెబల్ స్టార్ హీరోగా సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్పిరిట్ అనే సినిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా బడ్జెట్ ను 400 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశారు. అలాగే ప్రభాస్ 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే.. డైరెక్టర్ రెమ్యునరేషన్. ఈ స్పిరిట్ సినిమాలో వచ్చే లాభాల్లో డైరెక్టర్ కి 50 శాతం వాటా ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ తో అగ్రిమెంట్స్ చేసుకున్నారు. స్పిరిట్ సినిమాని స్టార్ట్ చేసేలోగా ప్రభాస్ నాలుగు సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక విదేశీ మార్కెట్ లో కూడా ప్రభాస్ కు ఉన్న రేంజ్ తో డైరెక్టర్ సందీప్ కెరీర్ కూడా ఓ రేంజ్ లో హిట్ అవుతుందని, ఇక సందీప్ దశ తిరిగిపోతుందనే టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment