ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. సినీ తారలు నెట్టింట త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమా ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ తమ అభిమాన తారలు ఏం ఫొటోలు షేర్ చేశారా అని ఎదురు చూస్తూ ఉంటారు.
తారుల కూడా తమ అభిమానుల కోసం రోజూ ఏదొక అప్‌డేట్ ఇస్తూనే ఉంటారు. అలాగే వారి డైలీ యాక్టివిటీ, ఫొటోషూట్లు కూడా నెట్టింట పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది సెలబ్రిటీలు వారి త్రో బ్యాక్ పిక్స్ ని షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇలానే ఇప్పుడు ఓ బుడ్డోడి పిక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఆ పిక్‌లో ఉన్న చిన్నవాడు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు.
ముద్దులొలికే ఈ చిన్నోడు తెలుగులోనే కాదు అటు తమిళ్‌లో కూడా చాలా సినిమాలు చేశాడు. హిందీ సినిమా, వెబ్ సిరీస్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అటు లవ్లీ క్యారెక్టర్లు చేస్తూనే ఇటు గ్యాంగ్‌స్టర్ క్యారక్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడైతే సిక్స్ ప్యాక్, కండలు తిరిగిన బాడీతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా కూడా ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ యంగ్ హీరోకి లేడీ ఫ్యాన్స్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇతను హీరోనే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. ఏంటి ఇంకా గుర్తుపట్టలేదా ? అతను మరెవరో కాదు.. యంగ్ హీరో సందీప్ కిషన్.
2010లో ప్రస్థానం సినిమాతో సందీప్ కిషన్ టాలీవుడ్లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. నెగెటివ్ రోల్‌తో కెరీర్ ప్రారంభించినా కూడా.. ఆ తర్వాత మంచి హీరో పాత్రలు సందీప్ కిషన్‌ని వెతుక్కుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తెలుగులోనే కాకుండా తమిళ్‌లో కూడా చాలా సినిమాలలో నటించాడు. హిందీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో కూడా సందీప్ నటించాడు. హిందీలో షోర్ ఇన్ ది సిటీ అనే సినిమాలో కూడా సందీప్ కిషన్ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ సందీప్ కిషన్ కి చాలామంది అబిమానులు ఉన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…