Samsung : ప్రస్తుత తరుణంలో మనకు స్మార్ట్‌టీవీలు చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ ఉండడంతో వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్లు కలిగిన టీవీలను తక్కువ ధరలకే అందిస్తున్నారు. ఇక సేల్ ఉన్నప్పుడు అయితే ఈ టీవీలు ఇంకా తగ్గింపు ధరలకే మనకు లభిస్తాయి. అందులో భాగంగానే ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ లేటెస్ట్‌గా ఒక సేల్‌తో మన ముందుకు వచ్చింది. శాంసంగ్ సంస్థ బిగ్ టీవీ డేస్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు మోడల్స్‌కు చెందిన టీవీలపై ఏకంగా 20 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు.
శాంసంగ్ సేల్‌లో భాగంగా పలు రకాల టీవీలపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని.. కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సేల్‌లో శాంసంగ్ నియో క్యూలెడ్ 8కె టీవీని కొంటే గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఫోన్ ఖరీదు రూ.1,31,999గా ఉంది.
ఇక శాంసంగ్‌కు చెందిన నియో క్యూలెడ్, ఇతర క్యూలెడ్ టీవీలు, 75 ఇంచుల ఫ్రేమ్ టీవీలు, క్రిస్టల్ 4కె యూహెచ్‌డీ టీవీలను కొంటే గెలాక్సీ ఎ22 5జి ఫోన్‌ను ఉచితంగా అందిస్తారు. దీని విలువ రూ.19,999గా ఉంది.
అలాగే శాంసంగ్ 50 ఇంచుల నియో క్యూలెడ్ టీవీ లేదా 50/55 ఇంచుల క్యూలెడ్ టీవీలను కొంటే స్లిమ్‌ఫిట్ కెమెరాను ఉచితంగా అందిస్తారు. దీని ధర రూ.8,900గా ఉంది. ఇక ఈ టీవీలపై సులభమైన వాయిదా పద్ధతులను కూడా అందిస్తున్నారు. 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అలాగే క్యూలెడ్ టీవీలను కొంటే అదనరంగా స్క్రీన్‌కు ఏకంగా 10 ఏళ్ల వారంటీని పొందవచ్చు. ఇలా అనేక ఆఫర్లను ఈ సేల్‌లో పొందవచ్చు. ఇక ఈ సేల్ ద్వారా టీవీలను కొనాలంటే శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ లేదా ఆఫ్ లైన్ స్టోర్స్ లేదా ఇతర ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్స్‌ను సందర్శించవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…