Kalyani : నటి కరాటే కల్యాణి దత్తత కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అసలు ఆమెకు, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి మధ్య జరిగిన గొడవ కాస్తా.. ఆమె వ్యక్తిగత కేసుగా మారింది. ఆమె చిన్న పిల్లలను కొనుగోలు చేసి విక్రయిస్తుందని ఫిర్యాదులు అందడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె పెంచుకుంటున్న బిడ్డను దత్తత తీసుకుందా.. తీసుకుంటే అందుకు సంబంధించిన పత్రాలు ఏవి ? అని వారు ఆరాలు తీశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో కల్యాణి లేదు. దీంతో ఆమె తల్లి విజయలక్ష్మి తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని.. తన కుమార్తె ఎలాంటి తప్పు చేయలేదని.. ఆమె ఆ బిడ్డను దత్తత తీసుకునే పెంచుకుంటుందని తెలిపింది.
అయితే కల్యాణి దత్తత తీసుకున్నది అధికారికంగా కాదని రుజువైంది. ఆమె 24 గంటల మిస్సింగ్ అనంతరం హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చింది. సదరు పాపకు చెందిన తల్లిదండ్రులను చూపిస్తూ ఆమె అసలు విషయాలను వెల్లడించింది. తాను వారి నుంచి పాపను కొనలేదని.. వారికి ఆర్థిక స్థోమత లేక పెంచుకోమని తనకు ఇచ్చారని.. అయితే ఇంకో ఏడాది అయ్యాక పాపను అధికారికంగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి దత్తత తీసుకుందామని.. కానీ దీన్ని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆమె స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. ఆ బిడ్డను ఎలాంటి పత్రాలు లేకుండానే ఆమె తీసుకుంది. సరే.. ఆమె చేస్తున్నది మంచి పనే. కానీ చట్టం దృష్టిలో ఆమె చేసింది మాత్రం నేరమే. దీంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక కల్యాణికి ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా తమ వద్ద కల్యాణి హాజరు కావాలని అన్నారు. అయితే ఆమె 24 గంటల నుంచి కనిపించకుండా పోయి సడెన్‌గా ప్రత్యక్షమైంది. దీంతో తాను మిస్సింగ్ కాదని.. అందరి మధ్యనే ఉన్నానని ఆమె స్పష్టం చేసింది. అయితే కల్యాణి హాజరు కాకపోవడంతో ఇంకో నోటీసు ఇస్తామని.. మళ్లీ 24 గంటలు వేచి చూశాక.. అప్పటికీ ఆమె రాకపోతే చర్యలు తీసుకుంటామని.. ఆమెను అరెస్టు చేస్తామని.. ఇలాంటి కేసుల్లో నిందితులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని ఆయన తెలిపారు. అయితే ఈ కేసు ముందు ముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…