Samsung : శాంసంగ్ అద్భుత‌మైన ఆఫ‌ర్‌.. టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు.. టీవీ కొంటే ఫోన్ ఉచితం..!

May 16, 2022 8:17 PM

Samsung : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు స్మార్ట్‌టీవీలు చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తున్నాయి. కంపెనీల మ‌ధ్య పోటీ ఉండ‌డంతో వినియోగ‌దారుల‌కు అద్భుత‌మైన ఫీచ‌ర్లు క‌లిగిన టీవీల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. ఇక సేల్ ఉన్న‌ప్పుడు అయితే ఈ టీవీలు ఇంకా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే మ‌న‌కు ల‌భిస్తాయి. అందులో భాగంగానే ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ లేటెస్ట్‌గా ఒక సేల్‌తో మ‌న ముందుకు వ‌చ్చింది. శాంసంగ్ సంస్థ బిగ్ టీవీ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప‌లు మోడ‌ల్స్‌కు చెందిన టీవీల‌పై ఏకంగా 20 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

శాంసంగ్ సేల్‌లో భాగంగా ప‌లు ర‌కాల టీవీల‌పై తగ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా జూన్ 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. కంపెనీ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ఈ సేల్‌లో శాంసంగ్ నియో క్యూలెడ్ 8కె టీవీని కొంటే గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా ఫోన్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఫోన్ ఖ‌రీదు రూ.1,31,999గా ఉంది.

Samsung giving huge discounts on smart tvs
Samsung

ఇక శాంసంగ్‌కు చెందిన నియో క్యూలెడ్‌, ఇత‌ర క్యూలెడ్ టీవీలు, 75 ఇంచుల ఫ్రేమ్ టీవీలు, క్రిస్ట‌ల్ 4కె యూహెచ్‌డీ టీవీలను కొంటే గెలాక్సీ ఎ22 5జి ఫోన్‌ను ఉచితంగా అందిస్తారు. దీని విలువ రూ.19,999గా ఉంది.

అలాగే శాంసంగ్ 50 ఇంచుల నియో క్యూలెడ్ టీవీ లేదా 50/55 ఇంచుల క్యూలెడ్ టీవీల‌ను కొంటే స్లిమ్‌ఫిట్ కెమెరాను ఉచితంగా అందిస్తారు. దీని ధ‌ర రూ.8,900గా ఉంది. ఇక ఈ టీవీల‌పై సుల‌భ‌మైన వాయిదా ప‌ద్ధ‌తుల‌ను కూడా అందిస్తున్నారు. 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ కూడా ఉంది. అలాగే క్యూలెడ్ టీవీల‌ను కొంటే అద‌న‌రంగా స్క్రీన్‌కు ఏకంగా 10 ఏళ్ల వారంటీని పొంద‌వ‌చ్చు. ఇలా అనేక ఆఫ‌ర్ల‌ను ఈ సేల్‌లో పొంద‌వ‌చ్చు. ఇక ఈ సేల్ ద్వారా టీవీల‌ను కొనాలంటే శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ లేదా ఆఫ్ లైన్ స్టోర్స్ లేదా ఇత‌ర ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ స్టోర్స్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now