Samantha : అలాంటి ప్రశ్నలు అడిగితే ఎంతో చిరాకు.. తనపై ట్రోల్స్ గురించి స్పందించిన సమంత !

October 21, 2021 2:46 PM

Samantha : కారణాలు ఏవైనా కానీ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతోంది. విడాకుల విషయం గురించి సమంత నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వార్తలలో నిలుస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత తనలో ఉన్న భావాలను సమంత సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు, పోస్టుల రూపంలో వ్యక్తపరుస్తోంది. ఈ క్రమంలోనే సమంత గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త రావడం.. అందుకు నెటిజన్లు తనని దారుణంగా ట్రోల్ చేయడం.. చేస్తున్నారు.

Samantha told about trolls on her how she responds

విడాకుల ప్రకటన అనంతరం సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తను ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించాలని భావిస్తున్నానని.. అయితే తన సినిమాలు టీవీలలో వస్తే మాత్రం తను టీవీ ఆఫ్ చేస్తానని ఈ సందర్భంగా పేర్కొంది. అదేవిధంగా కొందరు వారి చానల్స్ హెడ్ లైన్ కోసం వివిధ రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటి ప్రశ్నలు ఎదుటివారికి ఎంతో ఇబ్బంది కరంగా ఉంటాయి అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఎంతో చిరాకుగా ఉంటుందని పేర్కొంది.

ఇక తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయని అయితే వాటన్నింటి గురించి తను స్పందించాల్సిన అవసరం లేదని ఒకవేళ స్పందించాల్సి వస్తే అది నా సైలెన్స్ కన్నా ఎంతో నిశ్శబ్దంగా ఉంటుందని పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now