Samantha : మళ్లీ ఐట‌మ్ భామ‌గా మార‌నున్న స‌మంత‌..? ఆ మూవీలో ఐట‌మ్ సాంగ్ కు ఓకే..?

January 24, 2022 11:14 AM

Samantha : అల్లు అర్జున్ పుష్ప మూవీలో స‌మంత తొలి సారిగా ఐట‌మ్ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఊ అంటావా మామా.. ఊఊ అంటావా.. అంటూ స‌మంత అల‌రించింది. అయితే ఈ ఐట‌మ్ సాంగ్ చేసేందుకు స‌మంత మొద‌ట వెనుక‌డుగు వేసింది. చివ‌రి నిమిషం వ‌ర‌కు ఈ సాంగ్‌ను చేయొద్ద‌నే అనుకుంది. కానీ అల్లు అర్జున్ చొర‌వ‌తో స‌మంత ఎట్ట‌కేల‌కు ఐట‌మ్ సాంగ్ చేసింది.

Samantha to do item song again in that movie

అయితే ఫిలింన‌గ‌ర్ నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. స‌మంత ఇంకో ఐట‌మ్ సాంగ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. త‌న రెండో ఐట‌మ్ సాంగ్ ను చేసేందుకు ఆమె సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న లైగ‌ర్ సినిమాలో స‌మంత ఐట‌మ్ సాంగ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

పుష్ప సినిమాకు స‌మంత వంటి స్టార్ హీరోయిన్ ఐట‌మ్ సాంగ్ ఎంత ప్ల‌స్ అయిందో అంద‌రికీ తెలుసు. అందుక‌నే లైగ‌ర్ టీమ్ కూడా త‌మ సినిమాలో స‌మంత‌తో ఐట‌మ్ సాంగ్ చేయించేందుకు ఆలోచిస్తున్నార‌ట‌. దీంతో మూవీకి మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత గతంలో మ‌హాన‌టి మూవీలో క‌ల‌సి న‌టించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మార‌నున్నాడు. హిందీ వెర్ష‌న్‌ను క‌ర‌న్ జోహార్ స‌మ‌ర్పిస్తున్నారు. ఈ ఏడాది ఆగ‌స్టు 25న లైగ‌ర్ మూవీ విడుద‌ల కానుంది. పూరీ జ‌గ‌న్నాథ్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంఎంఏ ఫైట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

లైగ‌ర్ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అయితే స‌మంత ఈ మూవీలో ఐట‌మ్ సాంగ్ చేస్తుందా.. లేదా.. అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now