Samantha : నాని సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్న సమంత..?

October 27, 2021 5:08 PM

Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

Samantha to appear in nani movie

ఈ క్రమంలోనే నానికి “శ్యామ్ సింగరాయ్”, “అంటే సుందరానికి” అనే సినిమాలు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా నాని మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “దసరా”. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా నాని దసరా సినిమాలో సమంత ఒక గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సమంత విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయదని చెప్పడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహ పడ్డారు. అయితే సమంత దసరా సినిమాలో కనిపించనుందని తెలియడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now