Samantha Tattoos : త‌న ఒంటి మీద ఉన్న టాటూల‌పై స‌మంత కామెంట్స్.. వైర‌ల్‌..!

April 18, 2022 10:35 AM

Samantha Tattoos : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లోఒక‌రిగా ఉన్న స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తోంది. నాగ‌ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏ పని చేసినా దాన్ని మరింత వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. స‌మంత పెట్టే స్టోరీలలో ఎప్పుడూ ఫోటోలు, మోటివేషన్ కోట్స్ ఉంటున్నాయి. అవి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఇక సమంత చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. తాజాగా టాటూలపై కూడా సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత ఒంటిపై పలు చోట్ల టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే.

Samantha Tattoos she told about them
Samantha Tattoos

అయితే తాజాగా జ‌రిగిన చాట్‌లో ఓ నెటిజ‌న్ మీరు ఎప్పటికైనా వేసుకోవాలనుకున్న టాటూలు ఏంటో చెప్పమని అడిగాడు. దీంతో క్షణకాలం పాటు ఆలోచనలో పడిపోయిన సామ్‌.. తానసలు టాటూలే వేయించుకోకూడదనుకున్నానని బదులిచ్చింది. అలాంటి ఆలోచన ఉంటే తక్షణమే మానుకోమని అభిమానులకు సూచించింది. కాగా సామ్‌ గతంలో మూడు టాటూలు వేయించుకుంది. చైతూతో కలిసి చేసిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా వైఎంసీ అనే అక్షరాలను వీపుపై పచ్చబొట్టు వేయించుకుంది.

నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకు గుర్తుగా సామ్.. తన వీపుపై ymc అనే టాటూను అప్పట్లో వేయించుకుంది. ఇక సమంత నడుముకి పైభాగంలో చై అని టాటూ ఉంటుంది. అలాగే కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది. అయితే ఇలాంటి టాటూ నాగచైతన్య చేతికి కూడా ఉంటుంది. విడాకుల త‌ర్వాత చైతూ జ్ఞ‌పకాల కోసం స‌మంత వేయించుకున్న టాటూలు చెరుపుకోలేక‌పోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now