Samantha : గుండె ప‌గిలింది.. బాధ‌గా ఉంద‌న్న స‌మంత‌..

October 29, 2021 11:25 PM

Samantha : క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై యావ‌త్ క‌న్న‌డ నాడు తీవ్ర విషాదంలోకి మునిగిపోయింది. ఆయ‌న అభిమానులు అయితే క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. రోజువారీలాగే ఎంతో చ‌లాకీగా ఉండే ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించార‌నే నిజాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మృతి ప‌ట్ల అంద‌రూ షాక్‌కు గుర‌వుతూ.. ఆయ‌న కుటుంబానికి త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు.

Samantha shared emotional post about puneeth rajkumars death

కేవ‌లం శాండిల్‌వుడ్‌కు చెందిన తార‌లేకాక‌.. యావ‌త్ భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టీన‌టులు అంద‌రూ రాజ్‌కుమార్ మృతి ప‌ట్ల షాక్‌కు గురై విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. కాగా తాజాగా స‌మంత కూడా పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం ప‌ట్ల‌ తీవ్ర విచారం వ్య‌క్తం చేసింది.

https://www.instagram.com/p/CVnGrKTBBdg/?utm_source=ig_web_copy_link

ప‌గిలిన గుండె ఎమోజీని జ‌త చేస్తూ.. ఇంత త్వ‌ర‌గా వెళ్లిపోయారా.. బాధ‌గా ఉంది.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తోడుగా పునీత్ రాజ్‌కుమార్ ఫొటోను కూడా ఆమె ఆ పోస్టుకు జ‌త చేసింది.

కాగా స‌మంత ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో విడిపోయాక ఎక్కువగా విహార యాత్ర‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె దుబాయ్ లో ప‌ర్య‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now