Samantha : నాగ‌చైత‌న్య చాలా గొప్ప వ్య‌క్తి.. స‌మంత కామెంట్స్ వైర‌ల్‌..

August 15, 2022 8:02 AM

Samantha : వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా సమంత, నాగచైతన్య జంట ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఏ మాయ చేశావె చిత్రంతో నాగ చైతన్య, సమంత ప్రేమ బంధం మొదలైంది. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో కలిసి నటించిన‌ ఇద్దరి జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. నిజజీవితంలో పదేళ్లు ప్రేమలో రిలేషన్ కొనసాగించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంత ముచ్చటైన జంట గత ఏడాది అక్టోబర్ లో విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.

వీరు విడిపోయి దాదాపుగా పది నెలలు గడుస్తున్నా కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పై చైతూ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Samantha said Naga Chaitanya is a great person
Samantha

కాఫీ విత్ కరణ్ షోలో సమంత‌ వ్యాఖ్యలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సమంత, నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకోవడం వెనక ఆసక్తికరమైన సంఘటన ఉందనే విషయం తెలుస్తోంది. ఇండస్ట్రీకి  వచ్చిన కొత్తలో నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండేది. ఆ సమయంలో నన్ను నాగచైతన్య ఎంతగానో ఆదుకున్నాడు. ఇంటికి ఫోన్ చేయడానికి కూడా నా దగ్గర ఫోన్ లేదు. నాగచైతన్య నా మీద స్పెషల్ కేర్ తీసుకోవడమేకాక మా అమ్మతో కూడా మాట్లాడించాడు.

నాగ చైతన్య ఈజ్ ఎ పర్‌ఫెక్ట్ జెంటిల్ మ‌న్ అంటూ స‌మంత‌ ప్రత్యేకంగా పొగడ్తల వర్షం కురిపించింది.  ఈ కారణాల వల్ల‌నే నాగచైతన్య ప్రేమలో పడి వివాహం చేసుకొంది సమంత. ఇటీవల నాగచైతన్యను కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రశ్నించగా.. నాకు, సమంత‌కు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఏం మాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి సూపర్ హిట్ లవ్ స్టోరీ లు వచ్చాయి.

మా ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో బాగుంటుంది.. అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. అంతేకాకుండా సాయిపల్లవితో లవ్ స్టోరీ చిత్రంలో నటించాను. సాయిపల్లవితో కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంద‌ని చెప్పాడు. గతంలో కూడా బంగార్రాజు చిత్రం ప్రమోషన్‌లో సమంతతో నా ఆన్ స్క్రీన్ బెస్ట్ కెమిస్ట్రీ అంటూ చెప్పడం విశేషం. కానీ ఇంత ముచ్చటైన జంట ఎందుకు విడిపోయింద‌నే విషయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. దీనికి రానున్న రోజుల్లో అయినా స‌మాధానం చెబుతారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now