Samantha : విడాకుల కార‌ణాన్ని ఇక చెప్ప‌క త‌ప్ప‌దా ? స‌మంతకు త‌ల‌నొప్పే..?

April 13, 2022 8:47 AM

Samantha : అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌.. వీరిద్ద‌రి జంట ఎంతో చూడ‌ముచ్చ‌టగా ఉండేది. ఎన్నో ఏళ్ల పాటు వీరు ప్రేమించుకుని పెద్ద‌ల‌ను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక ఓ ద‌శ‌లో స‌మంత సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ అంత‌లోనే ఏం జరిగిందో తెలియ‌దు. ఇద్ద‌రూ విడిపోయారు. ఈ విష‌యం యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నే కాదు.. ప్రేక్ష‌కుల‌ను, ఫ్యాన్స్‌ను కూడా.. షాక్‌కు గురి చేసింది. అంత అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారు ? అనే కార‌ణాలు ఇప్పటికీ తెలియ‌దు. అటు నాగ‌చైత‌న్య, ఇటు స‌మంత‌.. ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేదు.

Samantha reportedly preparing to tell the reason for her divorce with Naga Chaitanya
Samantha

అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఈ జంట విడిపోవడం చాలా మందికి న‌చ్చ‌లేదు. మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్‌గా ఉన్న వీరు ఎందుకు విడిపోయారా ? అని ఫ్యాన్స్ ఇప్ప‌టికీ బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకునేలా ఆలోచిస్తున్నారు. అయితే త‌మ విడాకుల కార‌ణాల‌ను స‌మంత ఇక చెప్ప‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆమె న‌టించిన కాతు వాకుల రెండు కాద‌ల్ (తెలుగులో క‌ణ్మ‌ణి రాంబో ఖ‌తీజా) అనే త‌మిళ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఆ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను ప్ర‌స్తుతం నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో స‌మంత‌కు విడాకుల ప్ర‌శ్న క‌చ్చితంగా ఎదుర‌వుతుంద‌ని.. ఆమె అప్పుడు స‌మాధానం చెప్ప‌క త‌ప్ప‌ద‌ని.. తెలుస్తోంది. దీంతో ఆమె ఒక వేళ అలాంటి ప్ర‌శ్న‌లు ఎదురైతే ఎలా జ‌వాబు ఇవ్వాలా.. అని ఇప్ప‌టి నుంచే ప్రిపేర్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి మొన్నా మధ్య స‌మంత ముంబై వెళ్లిన‌ప్పుడు ఆమెకు త‌న విడాకుల కార‌ణంపై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. కానీ ఆమె దాట వేసింది. దీంతో అక్క‌డి సినీ జ‌ర్న‌లిస్టులు కూడా ఆమెను పెద్దగా నొప్పించే ప్ర‌శ్న‌లు వేయ‌లేదు. కానీ సౌత్ మీడియా అలా కాదు. తెలుగు.. త‌మిళం.. ఈ రెండు మీడియాలు క‌చ్చితంగా స‌మంత విడాకుల కార‌ణంపై ప్ర‌శ్న‌ల‌ను క‌చ్చితంగా అడుగుతాయి. ఈ జ‌ర్న‌లిస్టులు అంత సుల‌భంగా ఏమీ విడిచి పెట్ట‌రు. క‌నుక వారి నుంచి ఎదుర‌య్యే ఆ ప్ర‌శ్న‌ల‌కు ఎలా బ‌దులు చెప్పాలా.. అని స‌మంత ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే త‌న త‌మిళ చిత్రం మూవీ ప్ర‌మోష‌న్స్‌కు స‌మంత చాలా ప‌క‌డ్బందీగా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఒక వేళ నిజం చెప్పాల్సి వ‌స్తే.. స‌మంత ఓపెన్ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. మ‌రి కాతు వాకుల రెండు కాద‌ల్ ప్ర‌మోష‌న్ ప్రెస్ మీట్‌ల‌లో స‌మంత త‌నకు విడాకుల కార‌ణంపై ప్ర‌శ్న‌లు ఎదురైతే ఎలాంటి స‌మాధానాలు చెబుతుందో చూడాలి. అప్పుడైనా ఆమె అస‌లు కార‌ణాలు చెబుతుందా.. లేక ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేస్తుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now