Samantha : స‌మంత ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆస్తి ఏమీ లేదా ? ఆమె ధ‌నికురాలు కాదా ?

Samantha : సినిమా సెల‌బ్రిటీలు అన‌గానే చాలు.. స‌హజంగానే వారి వ‌ద్ద డ‌బ్బు ఎక్కువ‌గా ఉంటుంద‌ని, వారు ఆస్తి ప‌రుల‌ని అంద‌రూ అనుకుంటుంటారు. అయితే వాస్త‌వానికి అంద‌రి జీవితాలు ఒక్క‌టే విధంగా ఉండ‌వు. ముఖ్యంగా స‌మంత విష‌యానికి వ‌స్తే చాలా మంది ఆమె బాగా ఆస్తిప‌రురాల‌ని, ఆమె వ‌ద్ద డ‌బ్బు బాగా ఉంద‌ని అనుకున్నారు. కానీ అది నిజం కాద‌ట‌.

Samantha

2021 ఆమెకు అత్యంత బాధాక‌ర‌మైన సంవ‌త్స‌రం అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే నాగ‌చైత‌న్య‌కు ఆమె విడాకులు ఇచ్చింది మ‌రి. వాస్త‌వానికి చైతూ క‌న్నా స‌మంత‌కే ఎక్కువ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆమె బోల్డ్ సీన్ల‌లో న‌టించ‌డం వ‌ల్లే చైతూ ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. ఆమె అబార్ష‌న్ చేయించుకుంద‌ని, పిల్ల‌ల్ని క‌న‌డం ఇష్టం లేద‌ని.. కొంద‌రు కామెంట్లు చేశారు. అయితే అవ‌న్నీ అబ‌ద్ద‌మ‌ని త‌రువాత తేలింది. స‌మంత అలాంటి కామెంట్లు చేసేవారిపై కోర్టుకు వెళ్ల‌డంతో అవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని స్ప‌ష్ట‌మైంది.

ఇక విడాకుల అనంత‌రం వ‌చ్చే భ‌ర‌ణం కోస‌మే నాగ‌చైత‌న్యకు స‌మంత విడాకులు ఇచ్చింద‌ని కొంద‌రు అన్నారు. రూ.200 కోట్ల మేర ఆమెకు క‌ట్నం ఇవ్వ‌బోయినా ఆమె వ‌ద్దంద‌ని వార్త‌లు వచ్చాయి. ఇక నాగ‌చైత‌న్య ఆమెకు ఇచ్చిన ఇల్లు ఒక‌టి ఆమె వ‌ద్దే ఉంద‌ని, ఆమె దాన్ని తీసుకుంద‌ని అన్నారు. కానీ స‌మంత ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసి వేరే ఇల్లును అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ త‌రువాత చైత‌న్య ఆ ఇంటిని అమ్మేసిన‌ట్లు తెలిసింది.

కాగా స‌మంత కెరీర్‌ను, ఆమె పాపులారిటీని చూసి చాలా మంది ఆమె వ‌ద్ద డ‌బ్బులు, ఆస్తులు బాగా ఉన్నాయ‌ని అనుకుంటున్నార‌ట‌. కానీ ఆమెకు చెన్నై, హైద‌రాబాద్‌ల‌లో ఒక్కో ఇల్లు ఉందట‌. వాటిలో ఆమె ఉండ‌డం లేదు కానీ రెంట్‌కు ఇచ్చింద‌ట‌. దీంతో వాటికి నెల నెలా కొన్ని వేల రూపాయ‌ల్లో మాత్ర‌మే రెంట్ వ‌స్తుంద‌ట‌. ఇక హైద‌రాబాద్‌లోని ఎస్ఎల్ఎన్ ట‌ర్మిన‌స్‌లో ఆమెకు ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆమెకు ఒక మోస్త‌రు రెంట్ వ‌స్తుంద‌ట‌.

పైన చెప్పిన ఆస్తులు కాకుండా స‌మంత‌కు ఇంకా ఎలాంటి ఆస్తులు లేవ‌ని, ఉంటే కొన్ని కోట్ల రూపాయ‌ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఈ క్రమంలోనే స‌మంత‌కు ఆస్తులు పెద్ద‌గా లేవ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న త‌ల్లిదండ్రులు వారి త‌ర‌ఫు కుటుంబాల‌ను ఆదుకోవ‌డ‌మే స‌మంత ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ట‌. దీంతో తాను ఏమీ వెన‌కేసుకోవ‌డం లేద‌ని తెలిసింది. మ‌రో వైపు ఆమె ఓ చారిటీకి కూడా పెద్ద ఎత్తున విరాళంగా ఇస్తుంటుంది. క‌నుక స‌మంత‌కు అంద‌రూ అనుకున్న‌ట్లు భారీ ఎత్తున ఆస్తులు ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

స‌మంత ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10-12 ఏళ్ల‌వుతోంది. మ‌హా అయితే ఇంకో 3-4 ఏళ్లు ఉంటుందేమో. ఎందుకంటే హీరోల క‌న్నా హీరోయిన్స్ సినిమా ఇండ‌స్ట్రీలో ఉండే కాలం చాలా త‌క్కువ‌. అంత‌టి త‌క్కువ స‌మ‌యంలో బాగా ఆస్తుల‌ను సంపాదించాల‌న్నా క‌ష్ట‌మే. భారీ ఎత్తున రెమ్యున‌రేష‌న్ కూడా ల‌భించాలి. క‌నుక స‌మంత పెద్ద‌గా ఆస్తుల‌ను కూడ‌బెట్ట‌లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దీనిపై ఆమె ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM