Samantha : ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీ చేసుకున్న స‌మంత‌.. అస్స‌లు త‌గ్గ‌డం లేదుగా..!

February 7, 2022 8:09 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది. ఈమె తొలిసారిగా చేసిన ఐటమ్ సాంగ్ కూడా ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చింది. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా.. అంటూ స‌మంత చేసిన సాంగ్ ప్రేక్ష‌కుల‌కు ఒక రేంజ్‌లో ఊపు తెచ్చింది. దీంతో ఎక్క‌డ చూసినా ఈ పాట‌నే వినిపిస్తోంది. ఇక ఇటీవ‌లే స్విట్జ‌ర్లాండ్ టూర్ వేసిన స‌మంత అక్క‌డి నుంచి వ‌చ్చాక మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా మారింది.

Samantha partied with her friends
Samantha partied with her friends

స‌మంత తాజాగా న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌తో క‌లిసి వీకెండ్ ఎంజాయ్ చేసింది. సెల‌బ్రిటీ స్టైలిస్ట్ నీర‌జ కోన‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ల‌తో క‌లిసి స‌మంత పార్టీ చేసుకుంది. దానికి సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేయ‌గా.. అవి వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఆ ఫొటోకు ఆమె కాప్ష‌న్ కూడా పెట్టింది. గ‌ర్ల్స్ జ‌స్ట్ వాన్నా హావ్ ఫ‌న్‌.. అంటూ కాప్ష‌న్ పెట్టింది.

Samantha : పాన్ ఇండియా మూవీలో..

స‌మంత ప్రస్తుతం య‌శోద అనే పాన్ ఇండియా మూవీలో న‌టిస్తోంది. ఈమె త‌మిళంలో న‌టించిన కాతు వాకుల రెండు కాద‌ల్ అనే మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది. అలాగే శాకుంత‌లం అనే సినిమాలోనూ స‌మంత న‌టించింది. త్వ‌ర‌లోనే బాలీవుడ్ సినిమాతోపాటు ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కూడా ఈమె రెడీ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now