Samantha : స‌మంత గుడ్ న్యూస్‌.. ఆగ‌స్టు 7 ఉద‌యం 7 గంట‌ల‌కు బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంద‌ట‌..!

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈమె ఏం పోస్టు చేసినా అది వైర‌ల్ అవుతోంది. విడాకుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత త‌న గ్లామ‌ర్ డోసును పెంచ‌డంతోపాటు సోష‌ల్ మీడియాలోనూ మ‌రింత యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు వెకేష‌న్స్‌, పార్టీల‌కు వెళ్తూ సందడి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర హీరోల‌తో న‌టించిన స‌మంత అనేక హిట్స్ సాధించింది. దీంతో ఈమెకు కెరీర్‌లో తిరుగు లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే ఈమెకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత ఈమె చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్లిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. అందుక‌నే అనేక సార్లు సందేశాల‌ను పోస్ట్ చేసింది. ఆ స‌మయంలో ఆమెకు ఆమె స్నేహితులు అండ‌గా ఉన్నారు. అనేక టూర్లకు కూడా ఆమె వెళ్లొచ్చింది.

ఇక సమంత ప్ర‌స్తుతం వెకేష‌న్స్‌కు వెళ్తూనే మ‌రో వైపు సినిమాలు కూడా చేస్తోంది. ఇటీవ‌ల ఆమె పుష్ప సినిమాలో చేసిన ఐట‌మ్ సాంగ్‌తో ఆమె పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. ప్ర‌స్తుతం ఆమె గుణ‌శేఖ‌ర్‌తో క‌లిసి శాకుంత‌లం అనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే య‌శోద అనే మ‌రో పాన్ ఇండియా స్థాయి సినిమాలో ఈమె న‌టిస్తోంది. ఇక స‌మంత విడాకుల విష‌యం అయితే మాటిమాటికీ తెర‌పైకి వ‌స్తూనే ఉంది. ఆమెను కొంద‌రు ప్ర‌శంసిస్తుండ‌గా.. కొంద‌రు మాత్రం విమ‌ర్శిస్తూనే ఉన్నారు.

Samantha

ఇక స‌మంత‌కు చెందిన పాత పోస్టుల‌ను బ‌య‌ట‌కు తీసి వాటిని కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారు. స‌మంత గ‌తంలో చైత‌న్య‌ను మెచ్చుకున్న విష‌యాల‌కు చెందిన పోస్టుల‌ను కొంద‌రు ఈ మ‌ధ్య వైర‌ల్ చేశారు. ఇక తాజాగా ఇంకో పోస్టు కూడా వైర‌ల్ అవుతోంది. స‌మంత‌, చైత‌న్య క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఆమె చైత‌న్య గురించి మాట్లాడిన మాట‌ల‌ను ఇప్పుడు కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారు. చైత‌న్య మంచి వ్య‌క్తి అని, గొప్ప భ‌ర్త అని గ‌తంలో ఒక‌సారి స‌మంత అన్న‌మాట‌ల‌ను కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక గతంలో నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఒక‌సారి ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఓ లైవ్ చాట్ సెష‌న్ నిర్వ‌హించారు. అందులో భాగంగా స‌మంత‌ను కొంద‌రు ప్రెగ్నెన్సీ గురించి ప్ర‌శ్న‌లు అడిగారు. వాటికి ఆమె స‌మాధానం చెబుతూ.. త‌న శ‌రీరంలో వ‌చ్చే మార్పుల కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని, అయితే వారంద‌రికీ త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ చెబుతాన‌ని.. 2022 ఆగ‌స్టు 7వ తేదీన ఉద‌యం 7 గంట‌ల‌కు ఓ బిడ్డ‌కు జ‌న్మినివ్వ‌బోతున్నాను.. అంటూ అప్ప‌ట్లో ఆమె స‌మాధానం చెప్పింది. అయితే ఆ పోస్ట్‌ను ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM