Samantha : ఒకప్పుడు స్టార్ హీరోలు మాత్రమే కొన్ని కండిషన్స్ పెట్టేవారు. ఇప్పుడలా కాదు.. కొందరు కథానాయికలు కూడా నిర్మాతలకు కండిషన్స్ పెట్టి వారిని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో అక్కినేని మాజీ కోడలు సమంత కూడా చేరింది. విడాకుల తర్వాత సమంత సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే.
రీసెంట్‌గా సమంతకి సంబంధించిన రెండు సినిమాలపై అనౌన్స్‌మెంట్ వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న 30వ సినిమాలో సమంత నటించబోతుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శాంతరూబన్ జ్ఞానశేఖరన్ తెరకెక్కించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంలోనూ సమంత నటించనుంది.
ఈ చిత్రానికి హరి, హరీశ్ సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. వీరికి ఇదే తొలి సినిమా. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర టీమ్ వెల్లడించింది. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ ద్విభాషా చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసిన సమంత తన తదుపరి చిత్రాల నిర్మాతలకు కొత్త షరతులు పెడుతోంది.
షూటింగ్ ల కోసం మెజారిటీ పార్ట్ చెన్నై లేదా ఆ చుట్టుపక్కల లొకేషన్లను ఎంచుకోవాలని సమంత దర్శక నిర్మాతలను కోరుతుందట. హైదరాబాద్ లో షూటింగులు చేయడానికి ఆమె ఇష్టపడడంలేదు. ఒకవేళ హైదరాబాద్‌లో తప్పనిసరిగా చిత్రీకరించాలనుకుంటే కేవలం ఇండోర్ మాత్రమే ప్లాన్ చేయాలి. ఇండోర్ లొకేషన్లు సెట్లలో షూట్ చేయాలి. ఆరు బయట షూటింగ్ వద్దు అని ప్రత్యేకమైన కండిషన్స్ పెడుతోందట. మరి వాటికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…