Rashi Khanna : చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం.. రాశీ ఖన్నా సొంతం. కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారింది. ఇప్పుడు తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్న రాశీ ఖన్నా తాజాగా జరిగిన ఓ చిట్ చాట్‌లో బాయ్ ఫ్రెండ్ తాలూకు ప్రశ్నపై ఆసక్తికరంగా బదులిచ్చింది.
వీలున్నప్పుడల్లా నెటిజన్స్‌తో ముచ్చటించే రాశీ ఖన్నాకు నెటిజన్స్ నుండి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె కెరీర్, వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత ఓ నెటిజన్ ‘మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి’ అని ప్రశ్నించాడు. దీనికి రాశీ ‘అసలు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు’ అని బదులిచ్చింది. మరో నెటిజన్ ‘సింగిల్‌గా ఎలా ఉంటున్నావు’ అని అడగ్గా.. ‘ఏదో అలా గడిపేస్తున్నా’ అన్నట్లుగా సమాధానం చెప్పింది.
రాశీ ఖన్నా స్టన్నింగ్ ఆన్సర్‌కి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. హిందీ చిత్రంతో నటిగా పరిచయమై.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్థిరపడిపోయింది రాశీ ఖన్నా. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘విలన్’ అనే మూవీతో మలయాళం పరిశ్రమలోకి, ‘ఇమైక్కా నోడిగల్’ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆయా భాషల్లో సైతం అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగులో నాగ చైతన్యతో ‘థాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా చేస్తోంది.
తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ చేస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…