Samantha Naga Chaithanya : దాంపత్య జీవితానికి శుభం కార్డు.. స్నేహ బంధానికి కాదు..!

October 3, 2021 12:10 PM

Samantha Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య, సమంత నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పడింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా వీరి గురించి వస్తున్న వార్తలు నిజమంటూ నాగచైతన్య అధికారిక ప్రకటన చేశారు. సమంత, నాగచైతన్య కలిసి తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ ప్రకటన చేశారు.

Samantha Naga Chaithanya : దాంపత్య జీవితానికి శుభం కార్డు.. స్నేహ బంధానికి కాదు..!

ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న ఈ జంట కేవలం వారి వివాహ బంధానికి మాత్రమే ముగింపు పలికినట్టుగా తెలుస్తోంది. వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని అలాగే కొనసాగిస్తారని ప్రకటించారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారని అధికారికంగా ప్రకటించినప్పటికీ వీరి సోషల్ మీడియా ఖాతాలలో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయకుండా అలాగే ఉండటంతో వీరిద్దరూ ఫ్యూచర్ లో స్నేహ బంధంతో ఉండాలని భావించినట్లు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విడాకులతో విడిపోయిన ఈ జంట స్నేహితులుగా కొనసాగుతారన్న వార్త అభిమానులకు కాస్త సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now