Samantha Naga Chaithanya : విడాకులు తీసుకుంటున్న అక్కినేని కుటుంబీకులు.. తీరని శాపమా?

October 5, 2021 9:22 PM

Samantha Naga Chaithanya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల తర్వాత సోషల్ మీడియా అకౌంట్ లో ఎన్నో వార్తలు, పోస్టులు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా అక్కినేని నాగేశ్వరరావు మనం సినిమా టైమ్ లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంచలన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగేశ్వరరావు తన మనవళ్ళతో కూడా కలిసి నటించడం తన అదృష్టమని అన్నారు.

Samantha Naga Chaithanya divorce is it a curse on akkineni family

అయితే తన కుటుంబంలో కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం తనను ఎప్పుడూ బాధపెడుతూనే ఉంటాయని అన్నారు. తన మనవడు, మనవరాలైన సుప్రియ, సుమంత్ ల విడాకుల సంఘటన తనను బాధిస్తూనే ఉంటుందని అన్నారు. అలాగే అక్కినేని నాగార్జున విడాకులు కూడా తనను చాలాకాలం వేధించిందని.. తమ కుటుంబంలో నాగార్జునదే మొదటి విడాకులని అన్నారు. విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మీని వివాహం చేసుకున్నాక నాగచైతన్య పుట్టారు. కానీ వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా విడిపోవడం.. ఆ తర్వాత సినీ నటి అమలను పెళ్ళి చేసుకున్నారు.

అక్కడ్నుండి ప్రతి జనరేషన్ లో విడాకులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదేమైనా అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న శాపమా అనే రేంజ్ లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నాగ చైతన్య, సమంతలు కూడా విడిపోవడంతో ఈ చర్చ మరింత వేగంగా సాగుతోంది. అఖిల్ అక్కినేని కూడా తన ఎంగేజ్ మెంట్ ని క్యాన్సల్ చేసుకున్నారు. రీసెంట్ గా సమంత తండ్రి ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం తన మైండ్ బ్లాంక్ అయ్యిందని వెల్లడించారు. కానీ సమంత అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నానని అన్నారు.

అలాగే త్వరలోనే పరిస్థితులు బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మొదట్నుండి చైతన్య, సమంతల లవ్ జర్నీ ఎంతో అందంగా సాగింది. ఆ తర్వాత పెళ్ళిలో అందమైన మూమెంట్స్ ని రియలిస్టిక్ గా తీశారు. చాలా సంవత్సరాలు వీరిద్దరి పెళ్ళి వీడియోలు ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక వీరిద్దరూ ఫస్ట్ టైమ్ ఏ మాయ చేశావే సినిమాలోనే లవ్ స్టార్ట్ అయ్యిందని ఓ ఈవెంట్ లో కూడా ఈ జంట తెలిపింది. ఎంతో హ్యపీగా ఉన్న ఈ క్యూట్ కపుల్ ఇప్పుడు విడిపోవడం అనేది ఎంతో బాధాకరం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now