గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha Naga Chaithanya : స‌మంత‌ – చైతూ ఇంకా భార్యాభ‌ర్త‌లే.. ఎలాగో తెలుసా ?

Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైత‌న్య‌ – స‌మంత విడాకుల వ్య‌వ‌హారం టాలీవుడ్‌లో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ స్టార్ కపుల్‌ గా ఎంతో మంది సెలబ్రెటీల నుంచి…

Samantha Naga Chaithanya : స‌మంత‌ – చైతూ ఇంకా భార్యాభ‌ర్త‌లే.. ఎలాగో తెలుసా ?

Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైత‌న్య‌ – స‌మంత విడాకుల వ్య‌వ‌హారం టాలీవుడ్‌లో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ స్టార్ కపుల్‌ గా ఎంతో మంది సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ జంట సడన్ గా విడాకులు తీసుకోవడంతో ఒక్కసారిగా నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా నిలిచారు. వీరిద్ద‌రూ ఇలా విడిపోవ‌డం ఎవ‌రికీ నచ్చ‌లేదు. తిరిగి క‌లిస్తే బాగుండును.. అని చాలా మంది కోరుకుంటున్నారు.

Samantha Naga Chaithanya are wife and husband still know how

అక్కినేని ఫ్యామిలీ స‌న్నిహిత వ‌ర్గాల ప్ర‌కారం నాగ చైత‌న్య‌ – స‌మంత విడాకులు తీసుకోవ‌డానికి ఇంకా మూడు నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంద‌ట‌. 2022 జనవరిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆ తర్వాత వారి నుంచి తమ డైవోర్స్‌పై మరో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంద‌రూ అంటున్నారు.

ఎవరైనా జంట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన అనంతరం వారికి మూడు నెలల సమయం ఇచ్చి, మూడుసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాతే కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ లోపు వాళ్ల మన‌స్సు మారి మ‌ళ్లీ క‌లిస్తే మంచిదే, లేదంటే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. మ‌రి ఇద్ద‌రి మ‌న‌సులు మారి మ‌ళ్లీ చైతూ – సామ్ ఒక్క‌టి అయితే చాలా మంది సంతోషించడం ఖాయం.. అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి