Samantha Naga Chaithanya : చై – సామ్ డైవర్స్ మ్యాట‌ర్‌ డ్రామానా.. ఇదంతా వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసమేనా !

October 7, 2021 3:06 PM

Samantha Naga Chaithanya : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అయిన సమంత, నాగచైతన్యలు విడిపోవడంతో ఒక్కసారిగా టాలీవుడ్ డిజప్పాయింట్ అయ్యింది. నెటిజన్లు కూడా వీరిద్దరూ విడిపోవడంపై నిరాశను వ్యక్తం చేశారు. అయితే గత కొంత కాలంగా వీరి విడాకులపై సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ అక్టోబర్ 2వ తేదీన చై సామ్ లు విడిపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.

Samantha Naga Chaithanya divorce may be false netizen talk

చై సామ్ ల విడాకులు ప్రస్తుతం ఉట్టిదే అంటూ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. డైవర్స్ అనే ఓ వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్స్ లా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ డైవర్స్ వార్తల్ని స్ప్రెడ్ చేశారట. అక్టోబర్ 7వ తేదీన నాగచైతన్య, సమంతల వెడ్డింగ్ డే కావడంతో ఇదంతా ప్రమోషన్స్ కోసమే ఇలా చేశామని అనౌన్స్ చేద్దామనుకుంటున్నారట. అలా డైవర్స్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసమే అంటూ ప్రచారం సాగిద్దామని అనుకున్నారట. కానీ ముందుగానే సోషల్ మీడియాలో నాగ చైతన్య, సమంతలు విడిపోతున్నారని పలు రకాల వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో సమంత మీద యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో పలు రకాల వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సామ్ విడాకులకు కారణం అంటూ తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోల్ని పోస్ట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం హల్ చల్ అవుతున్న డైవర్స్ ఉట్టిదే అనే వార్త నిజమైతే అక్కినేని ఫ్యామిలీతో పాటు ప్రేక్షకులు కూడా సెలెబ్రేట్ చేసుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now