Samantha : స‌మంత బోల్డ్‌నెస్‌.. ఇలా ఆర‌బోస్తే కుర్రాళ్లు ఏమై పోవాలి..!

April 1, 2022 8:24 AM

Samantha : అక్కినేని నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత జోరు మాములుగా లేదు. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగ‌ప‌ర‌చుకుంటోంది. సినిమాలు, టీవీ షోస్, సోష‌ల్ మీడియా ఇలా ప్ర‌తి ప్లాట్‌ఫాంలోనూ రెచ్చిపోతోంది. కెరీర్ పరంగా ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది.

Samantha latest photo for a magazine viral
Samantha

ఇటీవ‌ల స‌మంత సౌత్‌పైనే కాకుండా నార్త్‌పైన కూడా దృష్టి పెడుతోంది. సమంతకు బాలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్లు వస్తుండడంతో ఆమె తన గ్లామర్ ప్రజెంటేషన్ విషయంలో మాత్రం చాలా మార్పులు చేస్తోంది. సమంత ఏదైనా గ్లామరస్ ఫోటోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు అయితే అసలు నిజంగా ఈ ఫోటోలో ఉన్నది సమంతనేనా అనేలా మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. గ‌తంలో స‌మంత చాలాసార్లు హాట్‌గా క‌నిపించినా.. తాజాగా ఈ అమ్మ‌డు ఇచ్చిన స్టిల్ మాత్రం కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేస్తోంది.

స‌మంత సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఎవరూ ఊహించని విధంగా హాట్ నెస్, బోల్డ్ స్టిల్స్ తో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా కాస్మోపోలిటన్ మేగజైన్ కి ఫోటోషూట్ నిర్వహించిన సమంత ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎవరూ ఊహించని విధంగా కనిపించింది.ఇందులో నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అనేలా స‌మంత క్యూట్ స్టిల్స్ ఉన్నాయి. ఈ అమ్మ‌డి మెస్మ‌రైజింగ్ లుక్స్ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత బోల్డ్ స్టిల్ ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now