Samantha : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు హాట్ సీట్‌లో స‌మంత‌ ? టీఆర్పీలు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందేనా ?

October 7, 2021 6:22 PM

Samantha : వెండితెర‌పై సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. బిగ్ బాస్ షోతో బుల్లితెర‌ని ట‌చ్ చేశాడు. ఈ షో భారీ టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇక ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేస్తున్నారు. జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఈ షో హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన కౌన్ బనేగా కరోడ్‌ప‌తిఅనే ప్రోగ్రాంకి తెలుగు వర్షన్ గా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, రెండు ఎపిసోడ్స్‌కి భారీ రేటింగ్ వ‌చ్చింది. ఇక కొద్ది రోజుల‌కి రాజమౌళి, కొరటాల శివ కూడా హాజరై ఆశ్చర్యపరిచారు.

Samantha may come to meelo evaru koteeshwarulu show

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకి ఊహించిన టీఆర్పీలు రాక‌పోవ‌డంతో ప‌లువురు స్టార్స్‌ని గెస్ట్‌గా తీసుకొస్తున్నారు. ఈ షో మొదటి కర్టెన్ రైజర్ ఈవెంట్ ను రామ్ చరణ్ తో ప్లాన్ చేయ‌గా, ఆ త‌ర్వాత‌ రాజమౌళి- కొరటాల శివ ఇద్దరితో ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు. ఆయ‌న ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నారు అని అంటున్నారు. మ‌రోవైపు ప్రభాస్ ను ఎవరు మీలో కోటీశ్వరుడు టీమ్స్ సంప్రదించిందని ఎన్టీఆర్‌తో ప్రభాస్ కి కూడా మంచి సంబంధాలు ఉండడంతో ఆయనకు మాట ఇచ్చేశాడని అంటున్నారు.

ఇక తాజాగా నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న స‌మంత‌ను హాట్ సీట్‌లో కూర్చోపెట్టేందుకు నిర్వాహ‌కులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం స‌మంత పేరు ట్రెండింగ్‌లోఉండ‌గా, ఈ అమ్మ‌డిని తీసుకొస్తే షోకి మ‌రింత టీఆర్పీ వ‌స్తుంద‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి మ‌రి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now