Samantha : పెళ్లైనా సమంత క్రేజ్ తగ్గలేదు, ఇక విడాకుల తర్వాత అయినా సామ్‌ని పక్కన పెడతారని అందరు భావించగా, ఆమె క్రేజ్ రెట్టిపు అయింది. సోషల్ మీడియా, సినిమాలు అంటూ నానా రచ్చ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత కేవలం ప్రధాన పాత్రలకు మాత్రమే కాకుండా.. స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేయడానికి కూడా రెడీ అయిపోయింది. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే సామ్.. ఒకట్రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మంచి క్రేజ్ పొందిన సమంత బాలీవుడ్‌లోనూ సినిమా చేయబోతున్నట్టు టాక్. ఇటీవల తాప్సీతో కలిసిన ఫోటో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాప్సీ ప్రోడక్షన్ లో సమంత మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే సమంత తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
తమిళంలో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన్ లీడ్ రోల్ పోషిస్తోంది. సినిమాలతో, విహార యాత్రలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో రచ్చ చేయడం మాత్రం ఆగడం లేదు. ఈ అమ్మడు తాజాగా ఎరుపెక్కిన అందంతో కుర్రకారు మతులు పోగొడుతోంది. సమంత గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి. విడాకులు తీసుకుంటేనేం.. సమంత గ్లామర్, క్రేజ్ ఎప్పటికీ తగ్గదంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఆమె గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ తీయించుకున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో అభిమానులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…