Samantha : స‌మంత ప్రేమ‌లో ప‌డిందా..? ఎవ‌రితో..? ఆమె పోస్ట్‌కి అర్థం ఏమిటి..?

October 11, 2022 1:29 PM

Samantha : నాగ చైత‌న్య‌తో విడాకుల త‌రువాత స‌మంత కొంత‌కాలం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. వాళ్లిద్ద‌రూ విడిపోయిన త‌రువాత ఆమె త‌న స్నేహితుల‌తో క‌ల‌సి కొన్ని విహార యాత్ర‌ల‌కు వెళ్లి దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది. కానీ కొంత‌కాలంగా స‌మంత ట్విట్ట‌ర్, ఇన్ స్టాగ్ర‌మ్ ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుంది. త‌న సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్ లు ఇవ్వ‌డం త‌ప్ప త‌ను నేరుగా సోష‌ల్ మీడియాలో క‌నింపించి చాలా కాలం అయ్యింది. దీంతో త‌న లైఫ్ లో ఏవో ఇబ్బందులు ఉన్నాయ‌ని, త‌ను ఏదో ఆప‌రేష‌న్ చేయించుకుంద‌ని ఇలా ర‌కర‌కాల రూమ‌ర్లు చెక్క‌ర్లు కొట్టాయి.

అయితే త‌ను ఈ మ‌ధ్య సామాజిక మాధ్య‌మాల్లో మ‌ళ్లీ యాక్టివ్ అయ్యింద‌ని తెలుస్తుంది. 3 రోజుల క్రితం త‌న పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసిన స‌మంత‌, దానికి ట్యాగ్ లైన్ గా , కింద ప‌డినా ఇంకా ఔట్ కాలేద‌ని రాసుకొచ్చింది. ఇక తాజాగా స‌మంత త‌న ఫోటోను కూడా ట్విట్ట‌ర్, ఇన్ స్టాగ్ర‌మ్ ల‌లో షేర్ చేసింది. ఈ ఫోటో లో ఆమె “ఇక నువ్వెప్పుడు ఒంట‌రిగా న‌డ‌వ‌వు” ( యు విల్ నెవ‌ర్ వాక్ అలోన్) అని రాసి ఉన్న టీ ష‌ర్ట్ ను ధ‌రించింది. దీంతో ఆమె ఎవ‌రితోనో రిలేష‌న్ లో ఉంద‌నే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Samantha latest post viral says she is not alone
Samantha

ఇంకా ట్విట్ట‌ర్ లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌలి కొడుకు కార్తికేయ, ఈగ సినిమా గురించి వేసిన పోస్టుపై కూడా స‌మంత స్పందించింది. ఈ విధంగా తాను మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాన‌ని , యాక్టివ్ అయ్యాన‌ని చెప్ప‌క‌నే చెప్తుంద‌ని అంటున్నారు. అయితే స‌మంత త‌న చ‌ర్మానికి వైద్యం కోసం అమెరికా వెళ్లింద‌ని కొంద‌రు చెబుతుండ‌గా ఆమె మాత్రం దీనిపై ఇంకా స్పందించ‌లేదు. కానీ ఆమె రీసెంట్ గా అమెరికా నుండి తిరిగి రావ‌డం మాత్రం నిజ‌మ‌నే వినిపిస్తుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆమె త్వ‌ర‌లో తాను విజ‌య్ దేవ‌ర‌కొండ తో క‌లిసి న‌టిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొన‌నుంద‌ని తెలిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now