Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యల విడాకుల తర్వాత పలు రకాల యాత్రలతో, కెరీర్ పై ఫోకస్ తో బిజీగా ఉంది. తన స్నేహితులతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తూ.. ఫోటోస్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె చెన్నైకి చేరుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ క్యూట్ ఫోటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ లో సమంత పెట్ డాగ్స్ హాష్, సాషాలంటే చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. పెట్ గార్డియన్ గా సమంత చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో తన పెట్స్ తో ఉన్న ఫోటోల్ని షేర్ చేసుకుంది.
అలాగే తన డాగ్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ని తన ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఇక రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోతోపాటు ఓ పోస్ట్ ని కూడా షేర్ చేసింది. నేను ఒక్క రోజు మాత్రమే వెళ్ళాను, ఒక్క రోజే, పాపం నా మొదటి బిడ్డ.. అంటూ ఏడుస్తున్న ఎమోజీస్ ని పెట్టింది. సామ్ షేర్ చేసిన ఫోటోస్ లో సాషా, హాష్ పై ఎక్కి ఆడుకుంటూ కనిపించాయి. ప్రజంట్ తన అప్ కమింగ్ సినిమాలపై సామ్ ఫోకస్ చేస్తోంది.
ఆమె చేతిలో ప్రస్తుతం రెండు భాషల సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు మైథాలాజికల్ డ్రామా శాకుంతలంలో యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీంతోపాటు కోలీవుడ్ లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో వస్తున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీపై సమంత ప్లాన్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…