Samantha : ఒక్క రోజే వెళ్లాను.. పాపం నా మొద‌టి బిడ్డ‌.. అంటూ సామ్ లేటెస్ట్ పోస్ట్..

November 12, 2021 8:51 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యల విడాకుల తర్వాత పలు రకాల యాత్రలతో, కెరీర్ పై ఫోకస్ తో బిజీగా ఉంది. తన స్నేహితులతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తూ.. ఫోటోస్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె చెన్నైకి చేరుకుంది. దీనికి సంబంధించిన  లేటెస్ట్ క్యూట్ ఫోటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ లో సమంత పెట్ డాగ్స్ హాష్, సాషాలంటే చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. పెట్ గార్డియన్ గా సమంత చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో తన పెట్స్ తో ఉన్న ఫోటోల్ని షేర్ చేసుకుంది.

Samantha latest post about her dogs goes viral

అలాగే తన డాగ్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ని తన ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఇక రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోతోపాటు ఓ పోస్ట్ ని కూడా షేర్ చేసింది. నేను ఒక్క రోజు మాత్రమే వెళ్ళాను, ఒక్క రోజే, పాపం నా మొదటి బిడ్డ.. అంటూ ఏడుస్తున్న ఎమోజీస్ ని పెట్టింది. సామ్ షేర్ చేసిన ఫోటోస్ లో సాషా, హాష్ పై ఎక్కి ఆడుకుంటూ కనిపించాయి. ప్రజంట్ తన అప్ కమింగ్ సినిమాలపై సామ్ ఫోకస్ చేస్తోంది.

ఆమె చేతిలో ప్రస్తుతం రెండు భాషల సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్‌ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు మైథాలాజికల్ డ్రామా శాకుంతలంలో యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీంతోపాటు కోలీవుడ్ లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో వస్తున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీపై సమంత ప్లాన్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now