Samantha : మెరూన్ క‌ల‌ర్ టాప్ ధ‌రించి గ్లామ‌ర్ షో చేస్తున్న స‌మంత‌..!

February 7, 2022 11:01 AM

Samantha : సమంత ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని అందులో షేర్ చేస్తోంది. అలాగే ప‌లు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ కూడా చేస్తోంది. 2021వ సంవ‌త్స‌రంలో స‌మంత నటించిన సినిమా ఒక్క‌టి కూడా విడుద‌ల కాలేదు. కానీ పుష్ప సినిమాలో ఆమె ఐట‌మ్ సాంగ్ చేసి అల‌రించింది. దీంతో అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌కు ఎంత పేరు వ‌చ్చిందో ఆమెకు కూడా అంతే గుర్తింపు ల‌భించింది. ఈ క్ర‌మంలోనే స‌మంత‌కు ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ కోసం ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈమె లైగ‌ర్‌లో ఓ ఐట‌మ్ సాంగ్ చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ విష‌యంపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇక స‌మంత ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది.

స‌మంత తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మెరూన్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన ఆమె గ్లామ‌ర్ షో చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత వాస్త‌వానికి త‌న గ్లామ‌ర్ డోసును పెంచింద‌నే చెప్ప‌వ‌చ్చు. వెకేష‌న్స్‌లో, బ్రాండ్ల ప్ర‌మోష‌న్ల‌లో ఆమె అందాల‌ను ఆర‌బోస్తోంది. ఇక పుష్ప ఐట‌మ్ సాంగ్‌లో అయితే ఒక రేంజ్‌లో అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఆమె గ్లామ‌ర్‌ను చూసి అంద‌రూ షాక‌య్యారు. గ‌తంలో ఆమె ఎన్న‌డూ ఆ స్థాయిలో చేయ‌లేద‌ని అంటున్నారు.

Samantha latest maroon color dress photos viral
Samantha

కాగా స‌మంత ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఆమె న‌టించిన సినిమాలు ఈ ఏడాదిలో వ‌రుస‌గా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. త‌మిళంలో ఆమె న‌టించిన కాతు వాకుల రెండ్ కాద‌ల్ మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల కానుండ‌గా.. అందులో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుపతి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే పాన్ ఇండియా మూవీ య‌శోదలోనూ స‌మంత నటించ‌గా.. శాకుంత‌లం అనే ఇంకో మూవీలోనూ ఆమె యాక్ట్ చేసింది. ఇవ‌న్నీ వ‌రుస‌గా త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now