Samantha : డేంజర్ జోన్‌లోకి సమంత.. విడాకులే కారణమా..?

October 3, 2021 7:38 PM

Samantha : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా సంచలనమైన వార్త ఉందా ? అంటే.. అది సమంత, చైతన్య విడాకుల విషయం అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఏమాత్రం సినిమాలలో అవకాశాలు తగ్గించకుండా ఎన్నో చిత్రాలలో నటించింది. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల మధ్య గొడవలు తలెత్తాయని, గొడవల కారణంతోనే విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి.

Samantha : డేంజర్ జోన్‌లోకి సమంత.. విడాకులే కారణమా..?

ఈ క్రమంలోనే తమ విడాకుల విషయం గురించి నాగచైతన్య, సమంత శనివారం అధికారికంగా తెలియజేశారు. ఇకపోతే విడాకులు తీసుకున్న సమంత డేంజర్ జోన్‌లో పడబోతోందని తెలుస్తోంది.  వివాహం తరువాత ఈమె పేరు పక్కన అక్కినేని అని పేరు ఉండడంతో ఈమె స్టేటస్ మరింత పెరిగిపోయింది. అక్కినేని కోడలిగా ఎంతో స్టార్ డమ్ సంపాదించుకున్న సమంత ప్రస్తుతం విడాకులు తీసుకోవడంతో ఈమెకు అవకాశాలు తగ్గి పోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సమంత విడాకుల ఎఫెక్ట్ తాను నటిస్తున్న తమిళ చిత్రం, గుణశేఖర్ శాకుంతలం సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇలా విడాకులు తీసుకొని సమంత డేంజర్ జోన్‌లో పడిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now