Samantha : నయనతార గురించి ఆసక్తికరమైన పోస్టు చేసిన సమంత..!

November 18, 2021 11:11 PM

Samantha : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా విశేషమైన ఆదరణ దక్కించుకుంది. తాజాగా నయనతార పుట్టినరోజు కావడంతో ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ ఆమెకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు.

Samantha interesting post about nayanthara

ఈ క్రమంలోనే నయనతార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నయనతార పుట్టినరోజు వేడుకలలో నటి సమంత పాల్గొంది. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

https://www.instagram.com/p/CWaURlEhoNx/?utm_source=ig_web_copy_link

 సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆమె వచ్చింది.. ఆమె ఎన్నో చూసింది.. ఆమె ధైర్యం చేసింది.. ఆమె కలలు కన్నది.. ఆమె ధైర్యం చేసి కలలు కని.. నటించింది. ఆమె సాధించింది.. హ్యాపీ బర్తడే నయన్ క్వీన్.. అంటూ #KaathuVaakulaRenduKaadhal హ్యాష్ ట్యాగులతో పోస్ట్ చేసింది.

ఇక విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రలలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now