Samantha : అక్కినేని కాంపౌండ్‌లో స‌మంత‌.. కార‌ణం ఏమిట‌బ్బా..?

November 25, 2021 12:46 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం స‌మంత త‌న కెరీర్‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వ‌రుస సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. ఇక పుష్ప కోసం ప్ర‌త్యేక సాంగ్‌లోనూ క‌నిపించ‌నుంది. అందుకుగాను ఈమె భారీ మొత్తంలో తీసుకుంటున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

Samantha in akkineni compound what is the reason

ఇక సోష‌ల్ మీడియాలో స‌మంత ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. కొటేష‌న్స్ షేర్ చేయ‌డంతోపాటు త‌న‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది. అయితే విడాకుల ప్రకటన చేసిన త‌రువాత ఇన్ని రోజుల‌కు స‌మంత మ‌రోమారు అక్కినేని కాంపౌండ్‌లో అడుగు పెట్టింది. దీంతో ఈ విష‌యం హాట్ టాపిక్ అవుతోంది.

అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోకు సమంత వచ్చినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్యతో విడాకులను ప్ర‌క‌టించిన‌ తర్వాత అన్నపూర్ణ స్టూడియోకు ఆమె మొద‌టిసారిగా వ‌చ్చింది. ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో ఆమె న‌టించింది. కాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

కాగా ఈ మూవీ డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేందుకు స‌మంత‌ అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్ర‌స్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జ‌రుగుతుండ‌గా.. ఆమె వాటిని ప‌రిశీలించేందుకు వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఆమె త‌న సినిమాలకు డ‌బ్బింగ్ చెప్పుకోదు. సింగ‌ర్ చిన్మ‌యి చెబుతుంది. అయిన‌ప్ప‌టికీ కొన్ని సార్లు స్టార్స్ త‌మ డ‌బ్బింగ్ ప‌నుల్లో పాల్గొంటారు. స‌మంత కూడా అందుక‌నే వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఇక నాగచైతన్య పుట్టినరోజున అత‌నికి బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌లేదు. కానీ త‌న కుక్క బ‌ర్త్ డేకు ఏకంగా ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో స‌మంత‌పై అక్కినేని ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment