Samantha : స‌మంత‌కు మెంట‌ల్ ఎక్కిందా ? ఎందుకు ?

November 11, 2021 12:16 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత వ్య‌వ‌హార శైలిలో మార్పు క‌నిపిస్తోంది. చాలా వ‌ర‌కు సినిమాల‌ను పొగుడుతూ త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్టులు పెడుతోంది. దీంతో త‌న సినిమాల‌కు కూడా వారు కొంత బూస్టింగ్ ఇస్తార‌నే ఆశ కావ‌చ్చు. కానీ ఆమె పెడుతున్న పోస్టులు మాత్రం వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన పోస్ట‌ర్‌ను షేర్ చేసింది.

Samantha got mental know the reason

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ లోంచి నాటు నాటు అనే సాంగ్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, ఎన్‌టీఆర్ క‌ల‌సి స్టెప్స్ వేశారు. వారి డ్యాన్స్ అదిరిపోయేలా ఉంది. ఇద్ద‌రూ స్వ‌త‌హాగా చ‌క్క‌గా డ్యాన్స్ చేస్తారు. ఇంత‌కు ముందెన్న‌డూ వీరు క‌ల‌సి డ్యాన్స్ చేయ‌లేదు. దీంతో వీరిద్ద‌రూ ఇలా డ్యాన్స్ చేస్తూ క‌నిపించే స‌రికి అభిమానుల‌కు పూన‌కాలు వ‌చ్చేశాయి. ఇక థియేట‌ర్ల‌లో ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించుకోవ‌చ్చు. ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

అయితే ఈ సాంగ్‌కు తాను ప‌డిపోయాన‌ని, త‌న‌కు ఈ సాంగ్‌ను చూస్తుంటే మెంట‌ల్ ఎక్కింద‌ని స‌మంత చెప్పింది. ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో స‌మంత‌కు ఎందుకు మెంట‌లెక్కిందా ? అని అంద‌రూ తెగ ఆలోచిస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7, 2022వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now